AMARNATH YATRA
Home » Amarnath Yatra: అమర్‌నాథ్‌ యాత్ర తాత్కాలిక నిలిపివేత

Amarnath Yatra: అమర్‌నాథ్‌ యాత్ర తాత్కాలిక నిలిపివేత

by admin
0 comment

ఆగస్టు 23 నుంచి అమర్‌నాథ్‌ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. యాత్రికుల సంఖ్య తగ్గడం, ట్రాక్‌ పునరుద్ధరణ పనుల కారణాలతో యాత్రను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది జులై 1 నుంచి ఆగస్టు 31 వరకు 62 రోజుల పాటు అమర్‌నాథ్ యాత్రకు కేంద్రం ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. దక్షిణ కశ్మీర్​లోని హిమాలయ పర్వతాల్లో, భూమికి 3,880 మీటర్ల ఎత్తులో అమర్​నాథ్​ ఆలయం ఉంది. ఈ ఏడాది యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 4.4 లక్షల మంది యాత్రికులు పుణ్యక్షేత్రాన్ని దర్శించారు.

“యాత్రకు వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గింది. యాత్రకు వెళ్లే అనంతనాగ్​ జిల్లా పహల్గామ్​, గండర్​బాల్​ జిల్లా బల్టాల్​ మార్గాల్లో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అత్యవసర మరమ్మతులు చేస్తోంది. దీని కారణంగా ఆ మార్గాల్లో యాత్రికులు వెళ్లడం శ్రేయస్కరం కాదు. ఆగస్టు 23 నుంచి రెండు మార్గాల్లో యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నాం” అని అధికారులు తెలిపారు. కాగా, ఆగస్టు 31న చాడీ ముబారక్ కార్యక్రమంతో యాత్ర ముగుస్తుంది.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links