election
Home » సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం

by admin
0 comment

తెలంగాణలో ప్రచార పర్వానికి తెరపడింది. కొన్నాళ్లుగా హోరెత్తించిన మైకులు మంగళవారం సాయంత్రం 5గంటలకు బంద్‌ అయ్యాయి. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ప్రచార గడువు చివరి నిమిషం వరకు హోరెత్తించాయి. హ్యాట్రిక్‌ సాధించాలనే పట్టుదలతో బీఆర్‌ఎస్, కర్ణాటక గెలుపును కంటిన్యూ చేస్తూ తెలంగాణలోనూ అధికారం కైవసం చేసుకోవాలని కాంగ్రెస్‌, అధికారమే లక్ష్యంగా బీజేపీ.. ఎన్నికల ప్రచారంలో పోటాపోటీగా హోరెత్తించాయి. ఇక రోజుకు రెండు, మూడు సభల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్‌.. మొత్తంగా 96 బహిరంగ సభల్లో ప్రచారం నిర్వహించారు. మంత్రి కేటీఆర్‌, హరీష్‌రావు కూడా రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేశారు. మరోవైపు ఆరు గ్యారెంటీలతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ 23 సభల్లో, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ 26 సభల్లో మాట్లాడారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే 10 సభల్లో, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి 55 సభల్లో, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య 3 సభల్లో, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ 10 సభల్లో, ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేష్‌ భఘేల్‌ 4 సభల్లో ప్రచారం నిర్వహించారు.

మరోవైపు బీజేపీ అగ్రనేతలంతా కూడా ఎన్నికల ప్రచారంలో హెరెత్తించారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ 8 సభలు, ఒక రోడ్‌ షోలో పాల్గొన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా 17 సభలు, 7 రోడ్‌ షోలలో ప్రసంగించారు. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా 8 సభలు, 3 రోడ్‌ షోలలో పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, అనురాగ్ సింగ్ ఠాకూర్, సాధ్వీ నిరంజన్ జ్యోతి, భాజపా పాలిత రాష్ట్రాల సీఎంలు అయిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాత్, గోవా సీఎం ప్రమోద్ సావంత్, మహారాష్ట్ర సీఎం ఏక్‌ నాథ్‌ శిందే, అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ భాజపా అభ్యర్థుల తరుపున ప్రచారం నిర్వహించారు. నవంబర్‌ 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. అన్ని నియోజకవర్గాల్లో ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. డిసెంబర్‌ 3న కౌంటింగ్‌ జరిగి ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links