Ola Electric
Home » Ola Electric నుంచి మూడు ఈ-స్కూటర్లు.. రూ.10 వేల ఆఫర్

Ola Electric నుంచి మూడు ఈ-స్కూటర్లు.. రూ.10 వేల ఆఫర్

by admin
0 comment

దిగ్గజ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ ‘ఓలా ఎలక్ట్రిక్’ కొత్తగా మూడు విద్యుత్ స్కూటర్లును ఆవిష్కరించింది. ఎస్‌1ఎక్స్‌ మోడల్‌గా మార్కెట్‌లో ప్రవేశపెట్టిన ఈ స్కూటర్‌ల్లో మూడు వేరియంట్లు ఉన్నాయి. ఎస్‌1ఎక్స్‌ (2 కిలోవాట్‌ బ్యాటరీ) పరిచయ ధర రూ.79,999గా నిర్ణయించింది. ఎస్‌1ఎక్స్‌ (3 కిలోవాట్‌ బ్యాటరీ) వేరియంట్‌ రూ.89,999కు; ఎస్‌1ఎక్స్‌+ స్కూటర్‌ ధర రూ.99,999గా తెలిపింది. అయితే మొదటి వారం వరకే ఈ ధర ఉంటుందని, తర్వాత ప్రతి వేరియంట్‌పై రూ.10 వేలు పెరుగుతుందని వెల్లడించింది.

ఎస్‌1ఎక్స్‌, ఎస్‌1ఎక్స్‌+ మధ్య సాఫ్ట్‌వేర్‌, అనుసంధానత ఫీచర్లలో మార్పులు ఉంటాయని వివరించింది. ఎస్‌1ఎక్స్‌+ వేరియంట్‌ ‘కీ లెస్‌ అన్‌లాక్‌’ ఉంటుందని పేర్కొంది. కాగా, ఎస్‌1ఎక్స్‌ ఒకసారి ఛార్జింగ్‌తో 151 కి.మీ నడుస్తుంది. దీని గరిష్ఠ వేగం గంటకు 90 కి.మీ ఉంటుంది. ఏడు రంగుల్లో స్కూటర్ మోడల్స్‌ అందుబాటులో ఉంటాయని తెలిపింది.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links