varalakshmi
Home » Varalakshmi Vratham – వరలక్ష్మీ వ్రతం కథేంటి?

Varalakshmi Vratham – వరలక్ష్మీ వ్రతం కథేంటి?

by admin
0 comment

శ్రావణమాసం… వ్రతాలూ నోములూ పూజలూ పేరంటాలతో సందడిగా ఉంటుంది. కొత్త పెళ్లికూతుళ్లు, ముత్తైదువులు పట్టుచీరలు కట్టుకుని నిండుగా నగలు పెట్టుకుని కళకళలాడిపోతుంటారు. కోరినంతనే వరాలనిస్తూ అష్టైశ్వర్యాలనూ ప్రసాదించే ఆ వరమహాలక్షీని పూజిస్తుంటారు. దయాగుణం, సంపద కలబోసిన తల్లి వరలక్ష్మీదేవిని ఆరాధిస్తుంటారు. శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా పాటిస్తారు. కుటుంబసభ్యుల సంక్షేమం కోసం గృహిణులు, మహిళలు వ్రతాన్ని నిర్వహిస్తారు. అష్టలక్ష్మీ ఆరాధన ఎంతటి ఫలాన్ని ఇస్తుందో ఒక్క వరలక్ష్మీ వత్రం అంతటి ఫలితాన్ని ఇస్తుందని ధార్మికగ్రంథాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో వరలక్ష్మీ కథ గురించి తెలుసుకుందాం.

జగన్మాత పార్వతీ దేవి ఒకనాడు సకల సౌభాగ్యాలనిచ్చే వత్రం ఏదైనా వుందా అన్ని పరమేశ్వరున్ని అడిగింది. వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే సిరిసంపదలు, సౌభాగ్యం లభిస్తాయని శివుడు తెలిపాడు. దీనికి సంబంధించిన కథను పార్వతీదేవికి ఆయన వెల్లడించాడు. పూర్వం మగధ రాజ్యంలోని కుంది నగరంలో చారుమతి అనే వివాహిత వుండేది. ఆమెకు కలలో అమ్మ‌వారు కనిపించి తన వ్రతాన్ని ఆచరించమని కోరింది. పొద్దున్నే తన స్వప్న వివరాలను కుటుంబసభ్యులకు తెలపడంతో వారు వ్రతాన్ని ఆచరించమని సూచించారు. పెద్దలు, కుటుంబసభ్యుల సహకారంతో చారుమతి వ్రతాన్ని ఆచరించింది.

శ్రావణ శుక్లపక్షం శుక్రవారం ప్రాతఃకాలవేళలో స్నానాదులు చేసి, తోటి ముత్తయిదువులతో మండపంలో లక్ష్మీదేవి అమ్మవారి స్వరూపాన్ని ప్రతిష్టించి వ్రతం నిర్వహించింది. వ్రతం తర్వాత ఆమె సకల సంపదలతో జీవితాన్ని కొనసాగించినట్టు ఈశ్వరుడు వ్రత వివరాలను పార్వితీ దేవికి వివరించాడు. సాక్షాత్తు పరమేశ్వరుడు వెల్లడించిన వ్రతమే ఈ వరలక్ష్మీ వ్రతం. ఈ శుభదినాన మహిళలు ఈ వ్రతాన్ని ఆచరిస్తే అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవుతారని ప్రతీతి.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links