Rajinikanth
Home » Jailer Movie – జైలర్ మూవీ ట్రయిలర్ రివ్యూ

Jailer Movie – జైలర్ మూవీ ట్రయిలర్ రివ్యూ

by admin
0 comment

సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ తొలిసారి కలసి చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘జైలర్‌’. యాక్షన్ కామెడీ ఎంటర్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో రజనీకాంత్ టైటిల్ రోల్‌లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సినిమాకు సంబంధించి తమన్న డాన్స్ తో వచ్చిన కావాలయ్య సాంగ్.. రజనీకాంత్ సోలోతో వచ్చిన హుకుం పాటలు చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జైలర్ థియేట్రికల్ ట్రైలర్ ని అక్కినేని నాగచైతన్య లాంచ్ చేశారు.

రజనీకాంత్ పవర్ ఫుల్ ప్రెజెన్స్, పెర్ఫార్మెన్స్, స్వాగ్, డైలాగ్ డెలివరీ, పవర్ ప్యాక్డ్ యాక్షన్ సీక్వెన్స్ తో ట్రైలర్ అద్భుతంగా ఉంది. రజనీ తనదైన మార్క్ తో కట్టిపడేశారు. దర్శకుడు నెల్సన్ రజనీకాంత్ పాత్రని చాలా యూనిక్ అండ్ పవర్ ఫుల్ గా డిజైన్ చేసి తన టాలెంట్ చూపించాడు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు వండర్ ఫుల్ గా ఉన్నాయి. అలాగే నెల్సన్ మార్క్ వినోదం కూడా ఉంది. ట్రైలర్ లో జాకీష్రాఫ్ సునీల్, రమ్యకృష్ణ లకు కూడా చోటు కల్పించారు. ఆగస్ట్ 10న జైలర్ సినిమా విడుదల కానుంది. తెలుగులో ఈ సినిమాను ఏషియన్ మూవీస్ సంస్థ రిలీజ్ చేస్తోంది. తాజాగా రిలీజైన ట్రయిలర్ తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links