fdi
Home » Telangana- విదేశీ పెట్టుబడుల్లో గుజరాత్‌ను దాటిన తెలంగాణ

Telangana- విదేశీ పెట్టుబడుల్లో గుజరాత్‌ను దాటిన తెలంగాణ

by admin
0 comment

తెలంగాణకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) భారీగా వస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల FDI పెట్టుబడుల్లో రూ.6,829 కోట్లతో తెలంగాణ నాలుగో స్థానంలో నిలిచింది. కేంద్ర పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) తాజాగా FDI డేటా వెల్లడించింది. ఈ త్రైమాసికంలో మహారాష్ట్ర, దిల్లీ, కర్ణాటక తొలి మూడు స్థానాల్లో ఉండగా, గుజరాత్ అయిదో స్థానానికి పరిమితమైంది. మహారాష్ట్రకు రూ.36,634 కోట్ల ఎఫ్‌డీఐలు, దిల్లీకి రూ.15,358 కోట్లు, కర్ణాటకకు రూ.12,046 కోట్లు దక్కాయి. అలాగే గుజరాత్‌కు రూ.5,993 కోట్లు, తమిళనాడుకు రూ.5,181 కోట్లు, హరియాణాకు రూ.4,056 కోట్లు వచ్చాయి.

2023 క్యాలెండర్‌ ఇయర్‌ తొలి ఆరునెలల్లో అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చిన రాష్ట్రాల్లో తెలంగాణ 6వ స్థానంలో నిలువగా, ఆంధ్రప్రదేశ్‌ 12వ స్థానానికి పరిమితమైంది. మహారాష్ట్ర, దిల్లీ, కర్ణాటక తొలి మూడుస్థానాల్లో నిలిచాయి. 16 రాష్ట్రాలకే ఒక్కోదానికి రూ.100 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. కేంద్ర వాణిజ్య శాఖలోని DPIIT 2019 అక్టోబరు నుంచి FDIలను రాష్ట్రాల వారీగా లెక్కిస్తోంది. అప్పటి నుంచి ఈ ఏడాది జూన్‌ వరకు ఆంధ్రప్రదేశ్‌కు రూ.6,495 కోట్ల ఎఫ్‌డీఐలు రాగా, తెలంగాణకు రూ.42,595 కోట్లు వచ్చాయి.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links