boyapati
Home » రామ్‌కు డూప్‌గా బోయపాటి- వీడియో వైరల్‌

రామ్‌కు డూప్‌గా బోయపాటి- వీడియో వైరల్‌

by admin
0 comment

ఎనర్జిటిక్​ హీరో రామ్​- బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘స్కంద’. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా మాస్​ ఆడియెన్స్​ను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా తాజాగా ఓటీటీ వేదికగా స్ట్రీమ్​ అవుతోంది. అయితే నెటిజన్లు ఓటీటీలో ఈ సినిమాలోని ఒక్కో సీన్​ను తీక్షణంగా పరిశీలిస్తూ కొన్నికొన్ని అంశాలను కనిపెడుతున్నారు. ప్రస్తుతం ఆ సీన్స్​ నెట్టింట్లో వైరల్‌ అవుతున్నాయి. క్లైమాక్స్ ఫైట్లో హీరో రామ్ దీపస్తంభాలు తీసుకుని విల‌న్ల మీద ఎటాక్ చేసే సీన్​ ఒక‌టి ఉంటుంది. దాన్ని మామూలుగా చూస్తే మనకు ఏం తేడాగా అనిపించ‌దు. కానీ స్లో మోషన్​లో గ‌మ‌నిస్తే.. ఒక చోట రామ్ స్థానంలో బోయ‌పాటి ఉన్నాడు. అచ్చం రామ్ లాగే డ్రెస్ వేసుకుని బోయ‌పాటే ఆ షాట్ చేశారు. అయితే అది ఎడిటింగ్​ మిస్టేకా లేకుంటే ఆ స‌మ‌యానికి హీరో అందుబాటులో లేనందున అలా చేశారో తెలియదు.


You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links