dravid
Home » World cup: ద్రవిడ్‌తో జై షా ప్రత్యేక భేటీ

World cup: ద్రవిడ్‌తో జై షా ప్రత్యేక భేటీ

by admin
0 comment

బలమైన భారత్‌ జట్టును ఓడించాలంటే ప్రత్యర్థులకు కఠిన సవాలే. స్వదేశంలోనే కాదు, విదేశీ పిచ్‌లపై టీమిండియా విజయాల రికార్డు పరంపర గత కొన్నాళ్లుగా కొనసాగుతోంది. కానీ ప్రపంచకప్‌ సమరాలు వచ్చే సరికి నాకౌట్‌ మ్యాచ్‌ల్లో తడబడుతూ కప్‌లను కోల్పోతుంది. కానీ ఈ సారి స్వదేశంలో జరిగే వన్డే ప్రపంచకప్‌ను సాధించాలని బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దానికోసం తాజాగా టీమిండియా కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌తో కలిసి బీసీసీఐ కార్యదర్శి జై షా భేటీ అయ్యారు. జనరల్‌ మీటింగ్‌ అని వారు చెబుతున్నా సమావేశంలో కీలక నిర్ణయాల గురించి చర్చించినట్లు తెలుస్తోంది. జట్టు కూర్పు గురించే కాకుండా కోచింగ్‌ స్టాఫ్ గురించి కూడా లోతుగా విశ్లేషించినట్లు సమాచారం.

వెస్టిండీస్‌ పర్యటనలో భాగంగా టీమిండియా అమెరికాలో రెండు టీ20లు ఆడిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ద్రవిడ్‌తో కలిసి జైషా భేటీ అయ్యారు. పర్సనల్‌ ట్రిప్‌గా వెళ్లిన జై షా.. ద్రవిడ్‌ను కలవడం విశేషం. అయితే సాధారణంగా భేటీ అయ్యామని, బీసీసీఐ సమావేశం కాదని వారు తెలిపారు. అయితే ప్రపంచకప్‌తో పాటు ఆసియా కప్‌ గురించి కూడా వారు చర్చించారని తెలిసింది.

రెండు వారాల్లోనే ఆసియా కప్‌ మొదలు కానుంది. కానీ ఇప్పటివరకు భారత జట్టును ప్రకటించలేదు. రేపటి నుంచి ఆరంభమయ్యే ఐర్లాండ్‌ సిరీస్‌ అనంతరం జట్టును ఎంపిక చేయాలని సెలక్టర్లు భావిస్తున్నారు. గాయం నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి వచ్చిన జస్ప్రీత్‌ బుమ్రాపైనే అందరి దృష్టి ఉంది. ఈ సిరీస్‌లో బుమ్రా తన మునపటి లయను అందుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links