Nayanthara
Home » Nayanthara- నయనతార మళ్లీ పెంచేసింది

Nayanthara- నయనతార మళ్లీ పెంచేసింది

by admin
0 comment

ఊహించిందే జరిగింది. నయనతార తన రెమ్యూనరేషన్ పెంచేసింది. ఎప్పుడైతే హిందీలో జవాన్ సినిమా హిట్టయిందో, అప్పుడే ఆమె పారితోషికంపై అనుమానాలు పెరిగాయి. అందరి అనుమానాల్ని నిజం చేస్తూ, ఆమె తన రేటు సవరించింది. తాజా సమాచారం ప్రకారం, ఆమె ఒక్కో సినిమాకు 12-13 కోట్లు డిమాండ్ చేస్తోంది.

సౌత్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది నయనతార. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో చూసుకుంటే, ఆమెను మించిన హీరోయిన్ లేదు. అలా మొన్నటివరకు సౌత్ లో హయ్యస్ట్ పెయిడ్ యాక్ట్రెస్ గా ఉండేది నయనతార. ఎప్పుడైతే జవాన్ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టిందో, అది కాస్తా బ్లాక్ బస్టర్ హిట్టయిందో, ఆ వెంటనే తన పారితోషికాన్ని మరింత పెంచేసింది. దీనికి ఓ కారణం కూడా ఉంది.

దక్షిణాదిలో ఎక్కువ మొత్తం తీసుకుంటున్న హీరోయిన్ గా ఆమెకు ఆల్రెడీ గుర్తింపు ఉంది. కానీ బాలీవుడ్ సగటు హీరోయిన్ తీసుకుంటున్న పారితోషికంతో పోలిస్తే, నయనతార ఛార్జ్ చేస్తోంది చాలా తక్కువ. మొన్నటివరకు ఆమె సౌత్ లో 8-9 కోట్ల రూపాయలు తీసుకునేది. బాలీవుడ్ లో శ్రద్ధాకపూర్ లాంటి సామాన్యమైన హీరోయిన్ కూడా ఈ మొత్తం ఇస్తున్నారు. అక్కడ దీపిక పదుకోన్, కత్రినాకైఫ్ లాంటి హీరోయిన్లు 18-20 కోట్ల రూపాయల రేంజ్ లో ఉన్నారు.

సో.. జవాన్ పెద్ద హిట్టయింది కాబట్టి, ఆటోమేటిగ్గా నయనతార తన పారితోషికం పెంచాల్సి వచ్చింది. త్వరలోనే ఆమె మరో హిందీ సినిమాలో కనిపించనుంది. ఆ మూవీకి ఆమె 12 నుంచి 13 కోట్ల రూపాయలు ఛార్జ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే సౌత్ వరకు వచ్చేసరికి ఆమె ఈ రేటు ఛార్జ్ చేయకపోవచ్చు. ఎందుకంటే, సౌత్ సినిమా కోసం 12 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తే ఎవ్వరూ ముందుకురారు. నయనతారకు ఎంత స్టార్ డమ్ ఉన్నప్పటికీ.. అంత మొత్తం ఇచ్చి బ్రేక్ ఈవెన్ అవ్వడం కష్టం. కాబట్టి నయనతార సౌత్ కు ఓ రేటు, నార్త్ కు మరో రేట్ ఫిక్స్ చేసింది. ప్రస్తుతం ఈ రేట్లే నడుస్తున్నాయి.

పారితోషికం సంగతి పక్కనపెడితే, ఇకపై సౌత్ లో చేసే ప్రతి సినిమాకు తను సహ-నిర్మాతగా వ్యవహరించాలని చూస్తోంది నయనతార. ఆల్రెడీ నయనతార భర్తకు ఓ బ్యానర్ ఉంది. ఇకపై తను చేసే సౌత్ సినిమాలకు ఆ బ్యానర్ ను యాడ్ చేయాలని ఆమె భావిస్తోంది. అంటే, తెలుగులో మహేష్ బాబు, రవితేజ, చిరంజీవి లాంటి హీరోలు చేస్తున్నట్టన్నమాట.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links