rajinikanth
Home » Rajinikanth- రజనీ సినిమాలో మరో స్టార్ హీరో

Rajinikanth- రజనీ సినిమాలో మరో స్టార్ హీరో

by admin
0 comment

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించే సినిమాలో మరో స్టార్ హీరో ఉంటాడా? ఒకవేళ ఉంటే రజనీ స్టార్ డమ్ ముందు ఆయన కనిపిస్తాడా? అందుకే రజనీతో మల్టీస్టారర్ సినిమాలు రావు. అయితే ఈసారి మాత్రం రజనీకాంత్ సినిమాలో మరో హీరో కనిపించబోతున్నాడు. అయితే అంతా అనుకుంటున్నట్టు హీరోగా మాత్రం కాదు.. ఆ డీటెయిల్స్ చూద్దాం..

రజనీకాంత్ సినిమాలో విలన్ పాత్ర కోసం పృథ్వీరాజ్ సుకుమారన్‌తో చర్చలు జరుగుతున్నాయి. అవును, కోలీవుడ్ ఇన్‌సైడ్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ మలయాళీ సూపర్ స్టార్, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్‌ హీరోగా రాబోయే చిత్రంలో కనిపించనున్నాడు. ఈ యువ దర్శకుడు తాజాగా లియోతో బ్లాక్‌బస్టర్‌ సాధించాడు. ఇప్పుడు తన నెక్ట్స్ సినిమాను రజనీకాంత్ తో చేయబోతున్నాడు. ఆ మూవీ కోసమే ఫృధ్వీరాజ్ ను తీసుకున్నారు.

వచ్చే సమ్మర్ నుండి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. లోకేష్ స్టైల్ లోనే ఫాస్ట్ గా షూటింగ్ కంప్లీట్ అవుతుంది. సో.. ఈ సినిమా కోసం పెద్దగా బ్రేక్స్ తీసుకోకుండా నటించబోతున్నారు రజనీకాంత్. ఈ చిత్రం చాలా స్పెషల్ గా ఉంటుందని లోకేష్ ఇప్పటికే ప్రకటించాడు. కథ ప్రకారం, సినిమాలో ఆశ్చర్యం కలిగించే ఎలిమెంట్స్ చాలా ఉంటాయని, నటీనటుల పరంగా కూడా చాలా మెరుపులు ఉంటాయని అంటున్నాడు. చెప్పినట్టుగానే పృధ్విరాజ్, ఈ ప్రాజెక్టులోకి వచ్చి చేరాడు. లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే.. ఈ చిత్రంలో విలన్ పాత్ర కోసమే మలయాళ స్టార్ పృథ్వీ సుకుమారన్ ను తీసుకున్నారు.

ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. విక్రమ్‌ సినిమాలో రోలెక్స్‌ పాత్ర కోసం ముందుగా పృధ్వీరాజ్ నే అనుకున్నారు. కానీ డేట్స్ ఎడ్జెస్ట్ చేయలేక అతడు నటించలేదు. ఆ పాత్రలో తర్వాత సూర్యను తీసుకున్నారు. రోలెక్స్ రోల్ లో సూర్య మెరిశాడు. మళ్లీ ఇన్నేళ్లకు, లోకేష్ కనగరాజ్, రజనీకాంత్ రాబోయే చిత్రంలో విలన్ పాత్ర కోసం పృథ్వీ సుకుమారన్ వచ్చి చేరాడు. ఈసారి అవకాశం మిస్ చేసుకోలేదు ఈ నటుడు.

కమల్ హాసన్ లాంటి సీనియర్ హీరోని విక్రమ్ సినిమాలో హ్యాండిల్ చేయడంలో లోకేష్ సక్సెస్ అయ్యాడు. ఈ చిత్రం చాలా సంవత్సరాల తర్వాత కమల్‌కు కమర్షియల్‌గా విజయాన్ని అందించింది. అంతేకాదు, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆల్ టైమ్ రికార్డ్‌ను కూడా బద్దలు కొట్టింది. తమిళనాడులో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అలా కమల్ ను సక్సెస్ ఫుల్ గా హ్యాండిల్ చేసిన లోకేష్, ఇప్పుడు రజనీకాంత్ ను ఎలా ప్రజెంట్ చేస్తాడో చూడాలి.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links