masala
Home » South Indian Films- సౌత్ మూవీస్ లో బిగ్గెస్ట్ గ్రాసర్స్ ఇవే

South Indian Films- సౌత్ మూవీస్ లో బిగ్గెస్ట్ గ్రాసర్స్ ఇవే

by admin
0 comment

సౌత్ సినిమాలు దేశాన్ని ఏలుతున్నాయి. కొన్నేళ్లుగా బాలీవుడ్ సినిమాలకు చోటు లేకుండా పోతోంది. దీంతో సౌత్ సినిమాల మధ్య పాన్ ఇండియా పోటీ మొదలైంది. టాలీవుడ్ నుంచి ఓ సినిమా వస్తే, దాని రికార్డులు బద్దలుకొట్టేందుకు కోలీవుడ్ నుంచి మరో సినిమా రెడీ అవుతోంది. అలా సౌత్ సినిమాల మధ్యనే పోటీ ఎక్కువైంది. ఈ క్రమంలో సౌత్ మూవీస్ లో బిగ్గెస్ట్ గ్రాసర్స్ గా నిలిచిన సినిమాలేంటో చూద్దాం..

సౌత్ లో బిగ్గెస్ట్ గ్రాసింగ్ మూవీస్ లో మొదటి స్థానంలో నిలిచిన సినిమా బాహుబలి-2. నిజానికి సౌత్ లోనే కాదు, ఇండియాలోనే బిగ్గెస్ట్ గ్రాసింగ్ మూవీగా నిలిచింది ఇది. రాజమౌళి-ప్రభాస్ కాంబోలో వచ్చిన ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 1810 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది.

ఇక సౌత్ బిగ్గెస్ట్ గ్రాసింగ్ మూవీస్ లో రెండో స్థానంలో నిలిచిన సినిమా ఆర్ఆర్ఆర్. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ఈ సినిమాకు వరల్డ్ వైడ్ ఇప్పటివరకు 1280 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. ఇప్పటికీ ఈ సినిమాను ఏదో ఒక మూల ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఇలా బిగ్గెస్ట్ గ్రాసర్స్ లో 2 సినిమాలూ రాజమౌళివే కావడం విశేషం.

లిస్ట్ లో మూడో స్థానంలో కేజీఎఫ్2 నిలిచింది. యష్ హీరోగా నటించిన ఈ సినిమాకు వరల్డ్ వైడ్ 1233 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ప్రశాంత్ నీల్ డైరక్ట్ చేసిన ఈ సినిమా ఓ ప్రభంజనం.

నాలుగో స్థానంలో 2.O నిలిచింది. రజనీకాంత్-శంకర్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాకు వరల్డ్ వైడ్ 709 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. ఐశ్వర్యరాయ్, ఎమీజాక్సన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు రెహ్మాన్ సంగీతం అందించాడు. హాలీవుడ్ స్థాయిలో ఈ సినిమాలో గ్రాఫిక్స్ ఉన్నాయి.

సౌత్ హయ్యస్ట్ గ్రాసర్స్ లో ఐదో స్థానంలో బాహుబలి-1 నిలిచింది. రాజమౌళి డైరక్ట్ చేసిన ఈ సినిమాకు 605 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. నిజానికి ఆ టైమ్ లో ఈ సినిమాదే అతిపెద్ద రికార్డ్. ఆ తర్వాత బాహుబలి-2, కేజీఎఫ్-2 రాకతో.. బాహుబలి-1 వసూళ్లు తక్కువగా కనిపిస్తున్నాయి.

ఆరో స్థానంలో పొన్నియన్ సెల్వన్-1 నిలిచింది. మణిరత్నం ఈ సినిమాతో బౌన్స్ బ్యాక్ అయ్యారు. భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 487 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. విక్రమ్, కార్తి, ఐశ్వర్యరాయ్, త్రిష లాంటి నటీనటులున్న ఈ సినిమాకు రెహ్మాన్ సంగీతం అందించాడు.

లిస్ట్ లో ఏడో స్థానంలో సాహో ఉంది. బాహుబలి లాంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత ప్రభాస్ నటించిన మూవీ కావడంతో, సాహోకు భారీగా ఓపెనింగ్స్ వచ్చాయి. సినిమా రిజల్ట్ తేడాకొట్టినా వసూళ్లు మాత్రం తగ్గలేదు. అలా ఈ మూవీకి 435 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది.

సౌత్ టాప్ గ్రాసర్స్ లో 8న స్థానంలో విక్రమ్ మూవీ నిలిచింది. కమల్ హాసన్, లోకేష్ కనగరాజ్ కాంబోలో వచ్చిన ఈ సినిమాకు 417 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. ఈ సినిమాతో కమల్ హాసన్ బౌన్స్ బ్యాక్ అయ్యారు. ఆయన మార్కెట్ ను అమాంతం పెంచిన సినిమాగా విక్రమ్ నిలిచింది.

ఇప్పుడు విక్రమ్ ను క్రాస్ చేసే రేంజ్ కు జైలర్ చేరుకుంది. ప్రస్తుతం 402 కోట్ల రూపాయల వసూళ్లతో ఈ సినిమా 9వ స్థానంలో ఉంది. మరికొన్ని రోజుల్లో, విక్రమ్ ను క్రాస్ చేసి 8వ స్థానానికి ఎగబాకుతుంది. నెల్సన్ డైరక్ట్ చేసిన ఈ సినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్ తన విశ్వరూపం చూపించారు.

ఇక లిస్ట్ లో పదో స్థానంలో కాంతార నిలిచింది. ఈ సినిమాకు 401 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. రిషబ్ శెట్టి రాసుకొని, డైరక్ట్ చేసి, నటించిన ఈ సినిమా దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించింది. ఏమాత్రం అంచనాల్లేకుండా వచ్చి అఖండ విజయం సాధించింది. ఈ సినిమాతో రిషబ్, పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు.

టాప్-10 లిస్ట్ లో స్థానం దక్కించుకునే అర్హత ఉన్నప్పటికీ కొద్దిలో ఆ అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు 2 సినిమాలు. వాటిలో ఒకటి ఆదిపురుష్ మూవీ. ఈ సినిమా 397 కోట్ల గ్రాస్ వద్ద ఆగిపోయింది. ఇక బన్నీ నటించిన పుష్ప సినిమా కూడా 360 కోట్ల రూపాయల వద్ద ఆగింది. పుష్ప-2లో అల్లు అర్జున్ ఈ లిస్ట్ లోకి చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links