grave
Home » అక్కడ శ్మశానంలో దీపావళి

అక్కడ శ్మశానంలో దీపావళి

by admin
0 comment

కరీంనగర్‌లో భాగంగా ఉన్న కార్కానగడ్డ ఊళ్లో దీపావళి జరుపుకునే తీరు కాస్త విచిత్రంగా ఉంటుంది. అందరిలా వీళ్ల పండుగ ఇంటికి మాత్రమే పరిమితం కాదు. ఆ రోజున అందరూ కొత్త బట్టలు వేసుకుని ఇళ్లలో కొవ్వొత్తులు వెలిగించడంతోపాటు, ఆ దీపాల్నీ బాణసంచానీ పట్టుకుని శ్మశానానికి బయల్దేరతారు. అక్కడున్న సమాధుల్ని పూలతో అలంకరించి, చనిపోయిన వాళ్లకిష్టమైన పిండివంటలు పెట్టి, దీపాలు వెలిగించి, అక్కడే టపాసులు కాలుస్తారు. ఈ పండుగకోసం వారం రోజుల ముందుగానే సమాధులకు రంగులు కూడా వేస్తారు. ప్రపంచంలో ఏ మూల ఉన్నా దీపావళినాటికి కుటుంబీకులంతా ఊరికి చేరుకుని శ్మశానానికి వెళ్లి తమ పూర్వికుల్ని స్మరించుకుంటారు. ఈ ఆచారం అక్కడ ఎలా మొదలైందనేది తెలియదు కానీ గత అరవయ్యేళ్లుగా ఈ ఆనవాయితీని మాత్రం వాళ్లు పాటిస్తున్నారు.

ఆ ఊరి పేరు దీపావళి.. ఎందుకంటే!
విభిన్నమైన ఊరి పేర్లను చూస్తూనే ఉంటాం. ఇక కొన్ని ఊరి పేర్లకు ఎంతో చరిత్ర కూడా ఉంటుంది. అయితే పండగ పేరు మీద ఊరి పేర్లును ఎప్పుడైనా విన్నారా? శ్రీకాకుళంలోని ఓ ఊరి పేరు దీపావళి. ఆ జిల్లా కేంద్రానికి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో గార మండలంలో ఈ గ్రామం ఉంది. దాని పేరే ‘దీపావళి’. ఆ పేరు రావడం వెనకో చిత్రమైన కథ వాడుకలో ఉంది. అప్పట్లో ఆ ప్రాంతాన్ని పాలించే రాజు ఈ ఊరు మీదుగా కళింగపట్నానికి బయలుదేరాడట. ఎండ తీవ్రత వల్ల వడదెబ్బ తగిలి పడిపోయాడు. అప్పుడు ఆ పక్కనే ఉన్న రైతులు అతన్ని పొలంలోకి తీసుకెళ్లి ప్రథమచికిత్స చేశారట. ఆ తర్వాత కోలుకున్న రాజు కృతజ్ఞతగా తన ప్రాణదీపాన్ని నిలబెట్టిన ఆ ఊరికి ఇలా ‘దీపావళి’ అని పేరు పెట్టాడట.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links