supreme court
Home » Supreme Court – స్వలింగ వివాహలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

Supreme Court – స్వలింగ వివాహలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

by admin
0 comment

స్వలింగ సంపర్కుల వివాహాలపై వివక్ష చూపకూడదని, అలా చేస్తే వారి ప్రాథమిక హక్కును ఉల్లఘించినట్లేనని సుప్రీంకోర్టు తెలిపింది. స్వలింగ సంపర్కుల వివాహాలపై చట్టబద్ధ ధ్రువీకరణ కోరుతూ దాఖలైన పిటిషన్లపై ఉన్నత న్యాయస్థానం మంగళవారం తీర్పు వెల్లడించింది. ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని అయిదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం నాలుగు వేర్వేరు తీర్పులు ఇచ్చింది. స్వలింగ సంపర్కులు పిల్లలను దత్తత తీసుకోవడం సహా కొన్ని అంశాలపై ధర్మాసనం ఏకాభిప్రాయానికి రాలేకపోయింది. అయితే LGBTQIA+ వర్గానికి చెందిన వ్యక్తుల వివాహానికి సమాన హక్కులు ఇచ్చేందుకు నిరాకరించింది. దీన్ని పార్లమెంటే తేల్చాలని పేర్కొంది. అయితే వారు సహజీవనంలో ఉండొచ్చని తెలిపింది.

ప్రత్యేక వివాహాల చట్టంలో మార్పులు చేయడం పార్లమెంట్ విధి అని, న్యాయస్థానాలు చట్టాలు తయారుచేయలేవని పేర్కొంది. స్వలింగ సంపర్కం కేవలం నగరాలకో, ఉన్నత వర్గాలకో చెందిన పరిమిత అంశం కాదని చెప్పింది. వివాహ వ్యవస్థ స్థిరమైనదని, దాన్ని మార్చలేమని అనుకోవడం సరికాదంది. జీవిత భాగస్వామిని ఎన్నుకోవడం జీవితంలో అంతర్భాగమని చెప్పింది. స్వలింగ జంటల కోసం ప్రత్యేక వివాహ చట్టాన్ని తీసుకురాకపోతే.. స్వాతంత్ర్యానికి పూర్వపు స్థితికి వెళ్లినట్లేనని అభిప్రాయపడింది. అయితే, ప్రత్యేక వివాహ చట్టం అవసరమా లేదా అనేది పార్లమెంట్‌ నిర్ణయిస్తుందని, దాని చట్టపరిధిలోకి న్యాయస్థానం వెళ్లాలనుకోవట్లేదని చెప్పింది. అలాగే స్వలింగ బంధాలపై వివక్ష చూపకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇక, వివాహేతర జంటలతో పాటు స్వలింగ జంటలు కూడా బిడ్డలను దత్తత తీసుకోవచ్చని పేర్కొంది.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links