phone
Home » Mobile: రోజుకు 2 గంటలే ఫోన్‌.. ఆ దేశంలో కఠిన ఆంక్షలు

Mobile: రోజుకు 2 గంటలే ఫోన్‌.. ఆ దేశంలో కఠిన ఆంక్షలు

by admin
0 comment

ప్రస్తుతం ఫోన్‌ లేకుండా రోజు గడవని పరిస్థితి. ఇంటర్నెట్‌ సాయంతో అరచేతిలోనే ప్రపంచాన్ని చూసేయెచ్చు. అయితే మొబైల్ వినియోగానికి పిల్లలు, టీనేజర్లు విపరీతంగా అలవాటు పడ్డారు. దీంతో వారిని నివారించడానికి స్మార్ట్‌ ఫోన్‌ వాడకంపై చైనా ప్రభుత్వం మరోసారి కొత్త నిబంధనలు తీసుకువచ్చింది.

మైనర్లకు రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల మధ్య ఇంటర్నెట్‌లోని చాలా సేవలు మొబైల్‌ ద్వారా అందుబాటులో లేకుండా నిబంధనలు విధించింది. 16-18 ఏళ్ల మధ్య వయసున్న వారు రోజుకు 2 గంటలు మాత్రమే ఇంటర్నెట్‌ వినియోగించుకోవాలని ఆంక్షలు జారీచేసింది. ఇక 8-15 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలకు గంట మాత్రమే అనుమతి. ఎనిమిదేళ్లలోపు వారికైతే 40 నిమిషాలు మాత్రమే ఇంటర్నెట్‌ వాడుకునే అవకాశం ఇచ్చింది.

అయితే ఈ ఆంక్షల నుంచి చైనా ప్రభుత్తం కొన్ని సర్వీసులకు మినహాయింపు ఇచ్చింది . మైనర్ల శారీరక, మానసిక అభివృద్ధికి తోడ్పడే యాప్స్‌, ప్లాట్‌ఫాంలకు ఆంక్షలు వర్తించవు. అయితే, నిర్దిష్టంగా ఏయే సేవలకు ఇంటర్నెట్‌ ఆంక్షల మినహాయింపు ఉంటుందనే విషయాన్ని చైనా అంతర్జాల నియంత్రణ సంస్థ అయిన ‘సైబర్‌స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఆఫ్‌ చైనా’ స్పష్టంగా చెప్పలేదు.

గతంలో ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడుకునే విషయంలో కూడా చైనా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. చిన్నారులు పగటిపూట ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడుకునే సమయాన్ని 90 నిమిషాలకే పరిమితం చేసింది. శుక్ర, శని, ఆదివారాలతోపాటు సెలవుల రోజుల్లో ఈ సమయాన్ని గంటకే పరిమితం చేస్తూ 2021లో నిబంధనలను మరింత కఠినతరం చేసింది. తాజాగా చిన్నారులకు స్మార్ట్‌ఫోన్ వాడకంపై మరిన్ని సరికొత్త నిబంధనలు అమలులోకి తీసుకువచ్చింది.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links