cricket
Home » Virat Kohli- ఫ్యాన్స్‌కు కోహ్లి బర్త్‌డే గిఫ్ట్‌.. దక్షిణాఫ్రికా లక్ష్యం 327

Virat Kohli- ఫ్యాన్స్‌కు కోహ్లి బర్త్‌డే గిఫ్ట్‌.. దక్షిణాఫ్రికా లక్ష్యం 327

by admin
0 comment

ఈడెన్‌గార్డెన్స్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్‌ అయిదు వికెట్లు కోల్పోయి 326 పరుగులు చేసింది. విరాట్‌ కోహ్లి (101*) అజేయ శతకంతో కదం తొక్కాడు. వన్డే ఫార్మాట్‌లో 49వ సెంచరీ సాధించిన కోహ్లి.. అత్యధిక వన్డే సెంచరీల సచిన్‌ రికార్డును సమం చేశాడు. వన్డేల్లో 49 సెంచరీని విరాట్ కోహ్లి 277 ఇన్నింగ్స్‌ల్లోనే అందుకోగా, సచిన్‌ 452 ఇన్నింగ్స్‌ల్లో సాధించాడు. తన 35వ పుట్టినరోజున ఈ అరుదైన ఘనతను అందుకోవడం విశేషం. అంతేగాక ఈడెన్‌గార్డెన్‌ వేదికగానే వన్డే ఫార్మాట్‌లో విరాట్‌ తొలి సెంచరీ నమోదు చేశాడు. కోహ్లితో పాటు శ్రేయస్‌ అయ్యర్‌ కూడా రాణించడంతో దక్షిణాఫ్రికా ముందు భారత్‌ 327 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. శ్రేయస్‌ అయ్యర్‌ 87 బంతుల్లో 77 పరుగులు చేశాడు.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు ఎంచుకున్న టీమిండియాకు అదిరే ఆరంభం లభించింది. కెప్టెన్‌ రోహిత్ శర్మ మరోసారి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 24 బంతుల్లో 40 పరుగులు చేశాడు. అతడి ధాటికి భారత్‌ 4.3 ఓవర్లలోనే 50 పరుగులు చేసింది. అయితే స్వల్పవ్యవధిలోనే రోహిత్‌ తో పాటు మరో ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్ (23) ఔటయ్యారు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన శ్రేయస్‌ తో కలిసి కోహ్లి ఇన్నింగ్స్‌ చక్కదిద్దాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 134 పరుగులు జోడించారు. ఈ క్రమంలో అర్ధశతకాలు సాధించారు. అయితే దూకుడుగా ఆడే ప్రయత్నంలో శ్రేయస్‌ ఎంగిడి బౌలింగ్‌లో వెనుదిరిగాడు. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన కేఎల్ రాహుల్ (8), సూర్యకుమార్‌ యాదవ్‌ (22) ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. కానీ సూర్య ఉన్నంతసేపు బ్యాటుకు పనిచెప్పాడు. మరో ఎండ్‌లో ఉన్న కోహ్లి నిలకడగా ఇన్నింగ్స్‌ కొనసాగించాడు. ఆఖర్లో జడేజా (29*) బౌండరీల మోత మోగించాడు.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links