bro
Home » నక్లెస్ రోడ్‌లో పవర్‌స్టార్‌ భారీ కటౌట్‌

నక్లెస్ రోడ్‌లో పవర్‌స్టార్‌ భారీ కటౌట్‌

by admin
0 comment

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ ఫ్యాన్స్‌కు జీ తెలుగు సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. హైదరాబాద్‌లోని నక్లెస్‌రోడ్‌, పీపుల్స్ ప్లాజా వద్ద 54 అడుగుల పవన్ కల్యాణ్ భారీ కటౌట్‌ను ఆవిష్కరించింది. ‘బ్రో-ది అవతార్‌’ సినిమాను అక్టోబర్‌ 15 సాయంత్రం 6 గంటలకు టెలివిజన్‌ ప్రిమియర్‌గా అలరించేందుకు ఈ ఏర్పాట్లు చేసేంది. మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌ పుట్టినరోజు అక్టోబర్‌ 15 కావడంతో ఈ సందర్భంగా అదే రోజున టీవీలో విడుదుల చేస్తున్నారు.

కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా థియేటర్లలో విడుదలైన బ్రో ప్రేక్షకులను మెప్పించి సూపర్‌హిట్‌ టాక్ అందుకుంది. మెగా మామ-అల్లుడు పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన ఈ సినిమాని ప్రముఖ దర్శకుడు సముద్రఖని రూపొందించారు. ఈ ఫాంటసీ డ్రామాకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్‌ప్లే, మాటలు అందించారు. పవర్‌స్టార్‌ పవర్ ప్యాక్డ్ యాక్టింగ్‌తో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టిన ఈ సినిమా బుల్లితెర ప్రేక్షకులనూ అలరించేందుకు సిద్ధమైంది. సోషియో ఫాంటసీగా రూపొందిన ఈ సినిమాలో పవర్ స్టార్ ‘టైం’గా న్యూ అవతార్లో అలరించారు. ఈ సినిమాలో ప్రియా ప్రకాశ్ వారియర్, కేతిక శర్మ, బ్రహ్మానందం, రాజా చెంబోల్, రోహిణి మొల్లెటి, తనికెళ్ల భరణి కీలక పాత్రలు పోషించారు.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links