Renu Desai
Home » ఆక్వా మెరైన్ కు వ్యతిరేకంగా సినీ ప్రముఖులు

ఆక్వా మెరైన్ కు వ్యతిరేకంగా సినీ ప్రముఖులు

by admin
0 comment

సామాజిక ప్రయోజనాలు కాపాడుకోవడం, పర్యావరణ పరిరక్షణ అనేది అందరి బాధ్యత. ఆ బాధ్యతను స్వచ్ఛందంగా చేపట్టి పోరాడుతున్నారు కొందరు సినీప్రముఖులు. కొత్వాల్ గూడ లో దేశంలోనే భారీ ఆక్వా మెరైన్ పార్క్ కు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే ఆహ్లాదం కోసం నిర్మిస్తున్న ఈ పార్క్ పర్యావరణానికి పెద్ద ముప్పు కాబోతుందని సినీ నటులు రేణూదేశాయ్, శ్రీదివ్య, దర్శకుడు శశి కిరణ్ తిక్కా తో పాటు మరికొందరు ప్రముఖులు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఎటువంటి పర్యావరణ అధ్యయనం లేకుండా చేపట్టిన ఈ అక్వా మెరైన్ పార్క్ నిర్మాణం ఆపివేయాలంటూ కోర్టును ఆశ్రయించారు. ఇటువంటి పార్కుల నిర్మాణం సింగపూర్, మలేసియా వంటి దేశాలలో జరిగాయని మన దేశంలో ఎందుకు సాధ్యం కాదని కోర్ట్ ప్రశ్నించింది.

అయితే వీటికి సమాధానంగా పిటీషనర్ తరపున న్యాయవాది శ్రీరమ్య వాదనలు వినిపిస్తూ ఎటువంటి పర్యావరణ అధ్యయనం లేకుండా ఏర్పాటుచేసే ఈ పార్కు లతో జలచరాలకు, వన్య ప్రాణులకు నష్టం వాటిల్లుతుందనే వాదనలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం… ప్రభుత్వానికి, HMDA కు నోటీసులు జారీ చేసింది. ఈ సందర్భంగా పిటీషనర్స్ లో ఒకడైన దర్శకుడు శశికిరణ్ తిక్కా మాట్లాడుతూ… పర్యావరణానికి చేటు చేసే విధంగా ఉన్న ఈ ప్రాజెక్ట్ పై చేస్తున్న పోరాటానికి మద్దతు కావాలని కోరారు. వేలాది జలచరాల మనుగడకు ముప్పు వాటిల్లే ఆక్వా మైరైన్ పార్క్ లు పర్యావరణాన్ని దెబ్బ తీస్తాయని… ఆహ్లాదం కోసం జలచరాల్ని ప్రజల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నంలో చాలా జలచరాలు చనిపోతాయని అన్నారు. దీంతోపాటు.. కత్రిమంగా ఏర్పాటు చేసిన లైట్స్ లో జలచరాల జీవనం అత్యంత బాధాకరంగా మారుతుందని… వేల గ్యాలన్ల నీటితో నడిచే ఈ ఆక్వా పార్క్ లు నీటి సమస్యకు కూడా కారణం అవుతాయని అన్నారు. ఇలాంటి పార్కుల నిర్మాణాన్ని ఇప్పటికే పలు దేశాల్లో ప్రజలు వ్యతిరేకించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links