chandrayan3
Home » chandrayaan-3: దక్షిణ ధ్రువమే ఎందుకు?

chandrayaan-3: దక్షిణ ధ్రువమే ఎందుకు?

by admin
0 comment

యావత్‌ భారత్‌ అపూర్వ ఘట్టం కోసం ఎదురుచూస్తోంది. మరికొన్నిగంటల్లో చంద్రయాన్‌-3 చరిత్ర సృష్టించనుంది. అన్ని అనుకూలిస్తే దక్షిణ ధ్రువంపై సాఫ్ట్‌ల్యాండింగ్‌ చేసిన తొలి దేశంగా భారత్‌ చరిత్ర లిఖిస్తుంది. అయితే దక్షిణ ధ్రువంపైనే ఎందుకు ల్యాండింగ్‌ చేస్తున్నారు? దానికి ప్రధాన కారణం అక్కడ నీటి జాడలు ఉన్నట్టు భావిస్తుండడమే. దక్షిణ ధ్రువంపై గురుత్వాకర్షణ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అక్కడ వెలుతురు లేకపోవడంతో ఉష్ణోగ్రతలు మైన్‌సలో ఉంటాయి. కాబట్టి అక్కడ నీరు ఉండే అవకాశం ఉంటుంది. ఇస్రో అంచనా ప్రకారం అక్కడ పది కోట్ల టన్నుల మేర నీరు ఉండొచ్చు. నీరు ఉన్న చోట మనిషి నివసించగలడు. కాబట్టి భవిష్యత్తులో చంద్రునిపై పరిశోధలకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది.

అంతేకాదు, విశ్వం ఆవిర్భావం గురించి కొత్త విషయాలను తెలుసుకునే అవకాశం ఉంది. భవిష్యత్తులో జాబిల్లిపై మానవ ఆవాసాల ఏర్పాటుకు బాటలు పడటానికి చంద్రయాన్‌-3 సక్సెస్‌ అవ్వడం ఎంతో కీలకం. జాబిల్లి దక్షిణ ధ్రువ ప్రాంతంలో భౌతిక పరిస్థితులు ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. ఉత్తర ధ్రువంతో పోలిస్తే దక్షిణ ధ్రువ ప్రాంతంలోని కొన్ని భాగాలు శాశ్వతంగా చీకట్లో ఉంటాయి. వందలకోట్లు ఏళ్లుగా ఆ ప్రాంతాలను సూర్యకాంతి స్పృశించలేదు. అందువల్ల అక్కడి మూలకాలు సౌర రేడియోధార్మికత కారణంగా తలెత్తే మార్పులకు లోనుకాకుండా ఉంటాయి. వాటిని శోధిస్తే విశ్వం గురించి అనేక నిగూఢ రహస్యాలు తెలిసే అవకాశం ఉంటుంది. అక్కడి పురాతన శిలలపై పరిశోధనలు జరపడం ద్వారా విశ్వ ఆవిర్భావం, తొలినాటి సౌర కుటుంబ చరిత్ర గురించి కూడా కొత్త వివరాలు తెలుసుకోవచ్చు. భవిష్యత్‌లో చేపట్టబోయే మానవసహిత, రోబోటిక్‌ యాత్రలకు ఈ డేటా ఎంతో ఉపయోగపడుతుంది.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links