Home » World Cup – ఇంగ్లాండ్‌కు అదే బాధ.. అదే వ్యథ!

World Cup – ఇంగ్లాండ్‌కు అదే బాధ.. అదే వ్యథ!

by admin
0 comment

ప్రపంచకప్‌లో సంచలనం. ఇంగ్లాండ్‌ను అఫ్గానిస్థాన్‌ మట్టికరిపించింది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌, ఈ వరల్డ్‌కప్‌లోనూ హాట్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ను ఓడించడమంటే ఏ జట్టుకైనా అంత తేలిక కాదు. కానీ అండర్‌డాగ్స్‌లా బరిలోకి దిగిన అఫ్గాన్‌ బట్లర్‌సేనను చిత్తుగా ఓడించింది. ప్రపంచకప్‌ సమరంలో గొప్ప పోరాటంగా అఫ్గాన్‌ చరిత్రను లిఖించింది.

దిల్లీ వేదికగా జరిగిన ఈ ఫైట్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. తొలుత అఫ్గాన్‌ 284 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్‌ రహ్మానుల్లా గుర్బాజ్‌ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. దూకుడైన బ్యాటింగ్‌తో ఎడాపెడా బౌండరీలు బాదాడు. ఆ తర్వాత వికెట్‌కీపర్‌ ఇక్రమ్‌ ఇన్నింగ్స్‌తో ఆ జట్టు మంచి స్కోరు సాధించింది. అయితే భారీ హిట్టర్లతో నిండిన ఇంగ్లాండ్‌కు 285 పరుగుల లక్ష్యం సవాల్‌ కాదని క్రికెట్ ప్రపంచమంతా భావించింది. అంతకుముందు ఇదే దిల్లీలో అఫ్గాన్‌ నిర్దేశించిన 273 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 35 ఓవర్లలోనే ఛేదించడంంతో.. ఇంగ్లాండ్‌ కూడా అలాగే రెచ్చిపోతుందనుకున్నారంతా. కానీ సీన్‌ రివర్స్‌ అయ్యింది. అఫ్గాన్‌ బౌలర్ల ధాటికి ఇంగ్లాండ్‌ విలవిలలాడింది. స్పిన్నర్ల ఉచ్చులో పడింది. వారికి తోడుగా పేసర్లు కూడా తమ వంతు పాత్ర పోషించడంతో అఫ్గాన్‌ రికార్డు విజయం సాధించింది. స్పిన్నర్లు ముజీబ్‌, రషీద్‌, నబి.. ఏ దశలోనూ ఆ జట్టును పుంజుకోన్వివలేదు. క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ ఇంగ్లాండ్‌పై ఒత్తిడి పెంచారు. ఇంగ్లాండ్‌ బ్యాటర్‌ బ్రూక్‌ పోరాడినా.. అతడు ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించగలిగాడు.

ప్రపంచకప్‌లో పసికూన చేతుల్లో ఓటమి పాలవ్వడం ఇంగ్లాండ్‌కు ఇది కొత్తేమి కాదు. చరిత్రలో ఇలాంటి భంగపాట్లను ఎన్నోసార్లు చవిచూసింది. 2011 ప్రపంచకప్‌లో ఐర్లాండ్‌.. ఇంగ్లాండ్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఇంగ్లాండ్‌ నిర్దేశించిన 328 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి రికార్డు సృష్టించింది. అదే మెగాటోర్నీలో బంగ్లాదేశ్‌ కూడా షాకిచ్చింది. 225 పరుగులకే ఆలౌట్‌ చేసి తర్వాత ఛేదించింది. ఈ దెబ్బలతో.. తర్వాత ఇంగ్లాండ్‌ స్వరూపమే మారిపోయింది. జట్టులోకి ఆల్‌రౌండర్ల అస్త్రాలను ఎక్కువగా తీసుకొచ్చుకుంది. అయితే 2015 ప్రపంచకప్‌లోనూ సేమ్‌ సీన్‌ రిపీట్‌ అయ్యింది. బంగ్లాదేశ్‌ వాళ్లకు కొరకరాని కొయ్యలా మారింది. బంగ్లా 276 పరుగుల లక్ష్యాన్ని ఇచ్చి 260 పరుగులకే కుప్పకూల్చింది. ఆ తర్వాత ఇంగ్లిష్‌ జట్టు తమ అప్రోచ్‌ను మార్చేసుకుంది. బజ్‌బాల్‌ సిద్ధాంతాన్ని తీసుకువచ్చింది. 350కు పైగా పరుగులు చేయడం సాధారణమే అన్నట్లుగా చెలరేగింది. అంతిమంగా 2019లో విశ్వవిజేతగా నిలిచింది. అయితే 2019 మెగాటోర్నీలోనూ చిన్నజట్టు చేతిలో ఇంగ్లాండ్‌ ఓటమిపాలవ్వడం గమనార్హం. కప్‌ను గెలిచినా శ్రీలంక చేతిలో అది ఘోరపరాజయాన్ని చవిచూసింది. చిన్న జట్లే అని తేలికగా తీసుకోవడమే వాళ్లని కొంపముంచుతుంది. బలమైన జట్లపైన విజయాల సాధించి పసికూన చేతుల్లో ఓటమిపాలవ్వడం ఈ ఇంగ్లిష్‌ జట్టుకే చెల్లుతుంది.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links