Heath Streak
Home » Heath Streak: దిగ్గజ క్రికెటర్‌ కన్నుమూత

Heath Streak: దిగ్గజ క్రికెటర్‌ కన్నుమూత

by admin
0 comment

జింబాబ్వే దిగ్గజ క్రికెటర్‌, మాజీ కెప్టెన్‌ హీత్ స్ట్రీక్ (Heath Streak) ఇక లేరు. 49 ఏళ్ల స్ట్రీక్‌ క్యాన్సర్‌తో పోరాడుతూ మరణించారు. ఈ విషయాన్ని ఆయన భార్య నదైనా తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున ప్రాణాలు కోల్పోయారని సోషల్‌మీడియా వేదికగా వెల్లడించారు. అయితే స్ట్రీక్‌ గత నెలలోనే తుదిశ్వాస విడిచారని కొన్ని మీడియాల్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అవన్నీ వదంతులే అన్ని స్వయంగా హీత్‌ స్ట్రీక్‌ వెల్లడించారు. ఇంకా బతికే ఉన్నానని, పూర్తి వివరాలు తెలియకముందే ఇలాంటి వార్తలు రావడం బాధించిందని అన్నారు. కానీ ఈ సంఘటన జరిగి పది రోజులు గడువకముందే ఆయన మరణించడంతో క్రికెట్ ప్రపంచం శోకసంద్రంలో మునిగింది.

జింబాబ్వే క్రికెట్‌లో హీత్‌ స్ట్రీక్‌ ఎన్నో ఘనతలు సాధించారు. ఆ దేశం తరఫున టెస్టుల్లో 100 వికెట్లు సాధించిన ఏకైక క్రికెటర్‌గా నిలిచారు. బౌలర్‌గానే కాకుండా బ్యాట్స్‌మన్‌గానూ జట్టుకు విజయాలు అందించారు. స్ట్రీక్‌ తన కెరీర్‌లో 65 టెస్టులు, 189 వన్డేలు ఆడారు. సుదీర్ఘ ఫార్మాట్‌లో 216 వికెట్లు, 1990 పరుగులు చేశారు. వన్డేల్లో 239 వికెట్లు, 2943 పరుగులు చేశారు.

అరంగేట్ర మ్యాచ్‌లో వికెట్‌ లేకుండా నిరాశపరిచిన స్ట్రీక్‌ తర్వాత జరిగిన టెస్టులో ఎనిమిది వికెట్లతో సత్తాచాటారు. రిటైర్మెంట్‌ ప్రకటించిన తర్వాత ఆయన కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. జింబాబ్వే, స్కాట్‌ల్యాండ్‌, బంగ్లాదేశ్‌ జట్లతో పాటు గుజరాత్‌ లయన్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కు కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. అయితే అవినీతి నిబంధనలు ఉల్లఘించాడనే కారణంతో ఐసీసీ ఆయనపై ఎనిమిదేళ్ల పాటు నిషేధం విధించింది.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links