varun marriage
Home » ఒక్కటైన ‘వరుణ్‌లవ్‌’.. ‘మెగా ఫ్రేమ్‌’ అదిరింది

ఒక్కటైన ‘వరుణ్‌లవ్‌’.. ‘మెగా ఫ్రేమ్‌’ అదిరింది

by admin
0 comment

వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి ఓ ఇంటి వారయ్యారు. తెరపై జంటగా నటించి ప్రేమ పాటలు పాడుకున్న వీళ్లు.. నిజజీవితంలోనూ మనసులు ఇచ్చిపుచ్చుకున్నారు. పెద్దల్ని ఒప్పించి పెళ్లి పీటలెక్కారు. ఈ జంట వివాహం బుధవారం ఇటలీలోని టస్కానీ వేదికగా బుధవారం రాత్రి 7.18 గంటలకు ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో మూడు ముళ్లు, ఏడడుగులతో కొత్తజీవితానికి శ్రీకారం చుట్టారు. అయితే ఈ వివాహ కార్యక్రమంలో చిరంజీవి, పవన్‌కల్యాణ్‌, రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌, అల్లు శిరీష్‌, సాయిధరమ్‌తేజ్‌, వైష్ణవ్‌తేజ్‌ తదితరులు పాల్గొని సందడి చేశారు. మెగా హీరోలంతా ఒకే చోట చేరిన ఫొటోను చిరంజీవి ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక నవంబర్‌ 5న హైదరాబాద్‌లో వరుణ్‌లవ్‌ రిసెప్షన్‌ జరగనుంది.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links