mehrin
Home » అది రేప్‌.. సెక్స్‌ సీన్‌ కాదు- మెహ్రీన్‌

అది రేప్‌.. సెక్స్‌ సీన్‌ కాదు- మెహ్రీన్‌

by admin
0 comment

స్టార్ హీరోయిన్‌ మెహ్రీన్‌ ‘సుల్తాన్‌ ఆఫ్‌ దిల్లీ’ అనే వెబ్‌సిరీస్‌తో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే, ఈ సిరీస్‌లో కొన్ని సన్నివేశాల్లో నటించినందుకు నెటిజన్లు ఆమెను ట్రోల్‌ చేశారు. దీనిపై మెహ్రీన్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇస్తూ ట్విటర్‌లో ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టింది. భార్యకు ఇష్టం లేకున్నా భర్త ఫోర్స్ చేయడాన్ని మ్యారిటల్ రేప్‌ అంటారని, ప్రస్తుతం చాలామంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారని మెహ్రీన్‌ పేర్కొంది. దీన్ని బయటకు చెప్పుకోలేక బాధపడుతున్నారని వివరించింది. ఇది చాలా భయంకరమైన అనుభవమని చెప్పింది. ఇలాంటి సన్నివేశమే తన వెబ్ సిరీస్‌లో ఉందని తెలిపింది. కొన్ని కథలు.. అలాంటి సన్నివేశాలను డిమాండ్ చేస్తాయని వాటిని చేయాల్సి వస్తుందని మెహ్రీన్ చెప్పింది. అయితే అలాంటి దారుణమైన సీన్‌ను కొంతమంది సెక్స్ సీన్లుగా పోల్చడం చూసి చాలా బాధపడ్డానని తెలిపింది.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links