ganesha
Home » Ganesh Nimajjanam – బై బై గణపయ్యా.. మళ్లీ రావయ్యా!

Ganesh Nimajjanam – బై బై గణపయ్యా.. మళ్లీ రావయ్యా!

by admin
0 comment

ఖైరతాబాద్‌ మహాగణపతి గంగమ్మ ఒడికి చేరాడు. 63 అడుగుల భారీ వినాయకుడి నిమజ్జనం పూర్తయింది. ఉదయం 6 గంటలకు మొదలైన గణేశ్‌ శోభాయాత్రలో వేలాది మంది భక్తులు హాజరయ్యారు. భక్తజన కోలాహలం మధ్య హుస్సేన్‌సాగర్‌కు తరలివచ్చిన మహా విఘ్నేశ్వరుడి నిమజ్జనం సుమారు మధ్యాహ్నం 1.30 గంటలకు పూర్తయింది. ట్యాంక్‌బండ్‌పై ఎన్టీఆర్‌ మార్గ్‌ వద్ద ఏర్పాటు చేసిన నాలుగో నంబర్‌ క్రేన్‌ వద్ద లంబోదరుడిని గంగమ్మ ఒడికి నిర్వాహకులు చేర్చారు.

గతేడాది 50 అడుగుల ఎత్తులో వెలిసిన ఖైరతాబాద్ వినాయకుడు ఈసారి 63 అడుగులతో రూపుదిద్దుకున్నాడు. దాదాపు 150 మంది కళాకారులు 100 రోజులు శ్రమించి ఈ భారీ లంబోదరుడి విగ్రహాన్ని తయారు చేశారు. పర్యావరణహితం కోసం మట్టి గణపతిని ఏర్పాటు చేశారు. తిలక్ ప్రేరణతో, సింగరి శంకరయ్య 1954లో ఖైరతాబాద్‌లోని ఒక అడుగు గణేషుడి విగ్రహాన్ని మొదటిసారిగా స్థాపించారు. అయితే నిర్మించిన విగ్రహం ఎత్తు 2014 వరకు ప్రతి సంవత్సరం ఒక్కో అడుగు పెంచుతూ వచ్చారు. 2019 నాటికి విగ్రహం శిఖరం ఎత్తు 61 అడుగులకు చేరింది. ఆ సంవత్సరంలో భారతదేశంలోనే అత్యంత ఎత్తైన గణేష్ విగ్రహంగా నిలిచింది. తర్వాత ఏడాది నుంచి మళ్లీ క్రమంగా ఒక్కో అడుగు తగ్గించారు. అయితే ఈ సారి ఏకంగా 63 అడుగుల విగ్రహాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేయడం విశేషం.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links