rohit hug
Home » Virat Kohli – టెన్షన్‌.. టెన్షన్‌.. ఆఖర్లో రోహిత్ హగ్‌

Virat Kohli – టెన్షన్‌.. టెన్షన్‌.. ఆఖర్లో రోహిత్ హగ్‌

by admin
0 comment

ఈ ప్రపంచకప్‌లో తొలిసారి భారత్‌ అభిమానులు తీవ్ర ఉత్కంఠ ఎదుర్కొన్నారు. బంతి బంతికి ఊపిరిబిగపట్టారు. నరాలు తెగే ఉత్కంఠను భరించారు. అయితే అది బంగ్లాదేశ్‌పై విజయం కోసం కాదు. విరాట్ కోహ్లి శతకం సాధిస్తాడా లేదా అని! టీమిండియా విజయానికి 26 పరుగులు అవసరమైన సందర్భంలో కోహ్లి సెంచరీకి కూడా సరిగ్గా అన్నే పరుగులు కావాలి. అక్కడి నుంచి అసలు క్రికెట్‌ మజా మొదలైంది. కేఎల్‌ రాహుల్‌, అభిమానులు మద్దతుతో విరాట్‌ ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తించాడు. అయితే బంగ్లా బౌలర్‌ హసన్ మహ్మద్‌ మధ్యలో వైడ్‌ వేశాడు. దీంతో అందరిలోనూ టెన్షన్‌ మరింత పెరిగింది.

ఇక విజయానికి 2 రన్స్‌ కావాల్సిన టైమ్‌లో నసుమ్‌ అహ్మద్‌ కూడా బంతిని లెగ్‌సైడ్‌ వేశాడు. అది వైడ్‌ అని అంపైర్‌ ప్రకటిస్తారేమో అని స్టేడియమంతా నిశబ్ధమైంది. అయితే కోహ్లి వికెట్లవైపుగా డీప్‌గా వెళ్లాడని భావించి అంపైర్‌ వైడ్‌ ఇవ్వలేదు. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత బంగ్లా బౌలర్లకు అవకాశమివ్వకుండా డీప్ మిడ్‌వికెట్‌ మీదుగా కోహ్లి భారీ సిక్సర్‌ బాదాడు. వన్డేల్లో 48వ సెంచరీ చేసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. మ్యాచ్‌ అనంతరం కెప్టెన్ రోహిత్‌ శర్మ.. కోహ్లి, రాహుల్‌ను కలిపి హగ్‌ చేసుకొని సంతోషాన్ని వ్యక్తం చేశాడు.

తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌ ఎనిమిది వికెట్ల కోల్పోయి 256 పరుగులు చేసింది. లిటన్‌ దాస్‌ (66), తన్జిద్‌ హసన్‌ (51), మహ్మదుల్లా (46) రాణించారు. జడేజా, బుమ్రా, సిరాజ్‌ తలో రెండు రెండు వికెట్లు, కుల్‌దీప్‌, శార్దూల్‌ చెరో ఒక్క వికెట్ తీశారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌కు శుభారంభం దక్కింది. ఓపెనర్లు శుభ్‌మన్‌ గిల్ (53), రోహిత్ శర్మ (48) దూకుడుగా ఇన్నింగ్స్‌ ఆరంభించారు. ఎడాపెడా బౌండరీలతో పరుగులు రాబట్టారు. అయితే రోహిత్ భారీ షాట్‌కు యత్నించి ఔటవ్వడంతో 88 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత గిల్‌తో కలిసి కోహ్లి (103) ఇన్నింగ్స్‌ నడిపించాడు. అయితే అర్ధశతకం పూర్తిచేసిన తర్వాత గిల్‌ కూడా భారీషాట్‌కు యత్నించి వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్‌ (19) కూడా ఎక్కువసేపు నిలవలేదు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన కేఎల్ రాహుల్‌ (34)తో కలిసి కోహ్లి జట్టుకు విజయాన్ని అందించాడు.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links