Dil Raju
Home » నిర్మాత దిల్‌రాజు ఇంట విషాదం

నిర్మాత దిల్‌రాజు ఇంట విషాదం

by admin
0 comment

ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. దిల్‌రాజు తండ్రి శ్యాంసుందర్ రెడ్డి సోమవారం సాయంత్రం కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చేర్పించారు. చికిత్స పొందుతూ శ్యామ్‌ సుందర్‌రెడ్డి తుదిశ్వాస విడిచారు. శ్యామ్‌ సుందర్‌ రెడ్డి స్వస్థలం నిజామాబాద్‌ జిల్లాలోని నర్సింగ్‌పల్లి. ఆయనకు దిల్‌ రాజుతోపాటు మరో ఇద్దరు కుమారులు ఉన్నారు. తండ్రి మరణంతో తీవ్ర విషాదంలో మునిగిపోయిన దిల్‌రాజ్‌ను పలువురు ప్రముఖులు, స్నేహితులు పరామర్శిస్తున్నారు. కొందరు ఫోన్‌లో, మరికొందరు స్వయంగా వెళ్లి ఓదార్చుతున్నారు.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links