sucide
Home » triangle love story: విశాఖలో ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీ.. ఇద్దరు మృతి

triangle love story: విశాఖలో ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీ.. ఇద్దరు మృతి

by admin
0 comment


విశాఖ ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీ విషాదాంతంగా ముగిసింది. ఇంటర్‌ చదివే ఒక యువతి ఇద్దరు యువకులను ప్రేమించింది. ఈ విషయం బయటకురావడంతో మైనర్‌ అయిన ఆమె సూసైడ్‌ చేసుకుంది. అనంతరం ఇద్దరి యువకుల్లో ఒకరు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మరొకరు పోలీసుల కస్టడీలో ఉన్నాడు. ఈ సంఘటన విశాఖపట్నంలోని గోపాలపురంలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్లే.. నాగేంద్ర కాలనీకి చెందిన యువతి గురువారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీనిపై పోలీసులు విచారణ చేపట్టగా పలు షాకింగ్‌ విషయాలు బయటపడ్డాయి. ఇంటర్ చదువుతున్న ఆ యువతి ఆదర్శనగర్‌కు చెందిన సూర్యప్రకాశ్‌, ఇందిరా నగర్‌కు చెందిన సాయికుమార్‌తో ఒకే సమయంలో ప్రేమలో ఉన్నట్లు తేలింది. ఈ విషయం వారికి తెలియడంతో వివాదాలు మొదలయ్యాయి. అంతేగాక సాయితో పెళ్లి అయినట్లు కూడా బయటకు వచ్చింది.

అయితే బలవన్మరణానికి రెండు రోజుల ముందు యువతి ఇంటికి ఇద్దరు యువకులు వేర్వేరు సమయాల్లో వచ్చారు. ఇద్దరిలో ఎవరితో ఉంటావో తేల్చుకోవాలని స్పష్టం చేశారు. దీంతో ఒత్తిడికి గురైన ఆమె ఆత్మహత్య చేసుకుంది. యువతి తండ్రి.. సూర్య ప్రకాష్, సాయికుమార్ పై ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. యువతి ఒత్తిడికి గురి చేయడం వల్లే మరణించినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ విషయం తెలిసి ఆందోళన చెందిన సూర్య ప్రకాష్ గోపాల పట్నం ఆర్డర్ క్యాబిన్ వద్ద శుక్రవారం రైలు కింద పడి మృతి చెందాడు. శనివారం మృతదేహాన్ని చూసిన అతని తల్లిదండ్రులు సూర్యప్రకాష్ గా గుర్తించారు. మరోవైపు సాయి కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links