bhagavanth
Home » Bhagavanth Kesari:బాలయ్య సినిమాలో రీమిక్స్ సాంగ్

Bhagavanth Kesari:బాలయ్య సినిమాలో రీమిక్స్ సాంగ్

by admin
0 comment

బాలకృష్ణ తాజా చిత్రం భగవంత్ కేసరి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ఇది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ ఇయర్ మోస్ట్ ఎవెయిటింగ్ మూవీస్ లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది భగవంత్ కేసరి. ప్రస్తుతం ‘భగవంత్ కేసరి’ షూటింగ్ హైదరాబాద్‌ రామోజీ ఫిలింసిటీలో వేసిన భారీ సెట్‌లో జరుగుతోంది. బాలకృష్ణ, కాజల్‌ అగర్వాల్‌, శ్రీలీలపై ఈ సాంగ్ షూట్ చేస్తున్నారు. భాను మాస్టర్‌ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. ప్రధాన తారాగణం అంతా కనిపించబోయే ఈ పాట, టోటల్ సినిమాకు హైలెట్ కానుంది. అంతేకాదు, ఇదే పాటలో బాలయ్య సూపర్ హిట్ రీమిక్స్ బిట్ కూడా యాడ్ చేశారు. దంచవే మేనత్త కూతురా అనే పాటకు రీమిక్స్ వెర్షన్ ఇందులో ఉంది.

‘భగవంత్ కేసరి’ డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోంది. మునుపెన్నడూ చూడని కొత్త క్యారెక్టర్‌లో బాలకృష్ణను చూపిస్తున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి . ఇప్పటికే విడుదలైన టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. బాలకృష్ణ పవర్ ఫుల్ ప్రజన్స్, తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పడం ఆకట్టుకుంది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, శ్రీలీల కీలక పాత్రలో కనిపించనుంది. బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ రాంపాల్‌ ఈ సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్నాడు. ఇందులో ఆయన విలన్‌గా కనిపించనున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను అక్టోబర్ 19న విడుదల చేయబోతున్నారు.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links