cpm
Home » TS Election- బరిలోకి ఒంటరిగా సీపీఎం.. బీజేపీ మూడో జాబితా విడుదల

TS Election- బరిలోకి ఒంటరిగా సీపీఎం.. బీజేపీ మూడో జాబితా విడుదల

by admin
0 comment

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం ఒంటరిగా బరిలోకి దిగుతున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఈ మేరకు 17 నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. మొత్తం 24 స్థానల్లో పోటీ చేస్తామని భావిస్తున్నట్లు తెలిపారు. మిగతా స్థానాలు, అభ్యర్థుల పేర్లను త్వరలో ఖరారు చేస్తామన్నారు. భద్రాచలం, అశ్వారావు పేటతో పాటు ఖమ్మం జిల్లాలో అయిదు స్థానాలు, నల్గొండలో మూడు, సూర్యపేటలో రెండు స్థానాల్లో పోటీ చేయనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగా తొలుత భద్రాచలం, పాలేరు సీట్లు ఇవ్వాలని అడిగామని ఆయన చెప్పారు.

వైరా, మిర్యాలగూడ సీట్లు ఇస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చిందని, కానీ ఆ తర్వాత మిర్యాలగూడతోపాటు హైదరాబాద్‌లో ఒక స్థానం ఇస్తామని ఆ పార్టీ చెబుతోందని ఆయన అన్నారు. చర్చల్లో భాగంగా తాము ఎన్నోమెట్లు దిగి వచ్చామని, కానీ కాంగ్రెస్‌ తమతో పొత్తు వద్దనేలా భావిస్తుందని, రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయని తెలిపారు. కాంగ్రెస్‌ నేతల వైఖరి సీపీఎంను ఎంతో బాధించిందని, కమ్యూనిస్టులకు విలువ ఇవ్వడం లేదని పేర్కొన్నారు.

అయితే బీజేపీని రాష్ట్రంలో ఒక్క సీటు కూడా గెలవనివ్వమని తమ్మినేని వీరభద్రం అన్నారు. బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్న స్థానాల్లో తమ పార్టీ నిలబడదని, తమ ఓట్లన్నీ బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఉన్న పార్టీలకు వేస్తామని ఆయన చెప్పారు. ఆ స్థానాల్లో కాంగ్రెస్‌కు అయినా, బీఆర్‌ఎస్‌కు అయినా ఓట్లు వేస్తామని అన్నారు.

మరోవైపు తెలంగాణ శాసనసభ ఎన్నికలకు అభ్యర్థుల మూడో జాబితా బీజేపీ విడుదల చేసింది. మొత్తం 35 మందితో జాబితాను వెల్లడించింది.

మంచిర్యాల- వీరబెల్లి రఘునాథ్‌
ఆసిఫాబాద్‌ (ఎస్టీ) – అజ్మీరా ఆత్మారాం నాయక్‌
బోధన్‌ – వడ్డి మోహన్‌రెడ్డి
బాన్సువాడ – యెండల లక్ష్మీనారాయణ
నిజామాబాద్‌ రూరల్‌ – దినేశ్‌ కులాచారి
మంథని – చందుపట్ల సునీల్‌రెడ్డి
మెదక్‌ – పంజా విజయ్‌కుమార్‌
నారాయణ్‌ఖేడ్‌ – జనవాడె సంగప్ప
అందోల్‌ (ఎస్సీ)- పల్లి బాబూమోహన్‌
జహీరాబాద్‌ (ఎస్సీ) – రామచంద్ర రాజ నరసింహా
ఉప్పల్‌ – ఎన్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌
ఎల్బీనగర్‌ – సామ రంగారెడ్డి
రాజేంద్రనగర్‌ – తోకల శ్రీనివాస్‌రెడ్డి
చేవెళ్ల (ఎస్సీ) – కేఎస్‌ రత్నం
పరిగి – బోనేటి మారుతి కిరణ్‌
ముషీరాబాద్‌ – పోస రాజు
మలక్‌పేట్‌ – శ్యామ్‌రెడ్డి సురేందర్‌రెడ్డి
అంబర్‌పేట – కృష్ణ యాదవ్‌
జూబ్లీహిల్స్‌ – లంకల దీపక్‌ రెడ్డి
సనత్‌నగర్‌ – మర్రి శశిధర్‌రెడ్డి
సికింద్రాబాద్‌ – మేకల సారంగపాణి
నారాయణ్‌పేట్‌ – రతంగ్‌ పాండురెడ్డి
జడ్చర్ల – చిత్తరంజన్‌ దాస్‌
మక్తల్‌ – జలంధర్‌రెడ్డి
వనపర్తి – అశ్వత్థామరెడ్డి
అచ్చంపేట (ఎస్సీ)- దేవని సతీశ్‌ మాదిగ
షాద్‌నగర్‌ – అండె బాబయ్య
దేవరకొండ (ఎస్టీ)- కేతావత్‌ లాలూ నాయక్‌
హుజూర్‌నగర్‌ – చల్ల శ్రీలతారెడ్డి
నల్గొండ- మాదగాని శ్రీనివాస్‌గౌడ్‌
ఆలేరు – పడాల శ్రీనివాస్‌
పరకాల – కాలి ప్రసాద్‌రావు
పినపాక (ఎస్టీ) – పొడియం బాలరాజు
పాలేరు – నున్న రవికుమార్‌
సత్తుపల్లి (ఎస్సీ)- రామలింగేశ్వరరావు

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links