Prabhu Deva
Home » Prabhu Deva’s wolf: ప్రభుదేవా కెరీర్ లో తొలి పాన్ ఇండియా మూవీ

Prabhu Deva’s wolf: ప్రభుదేవా కెరీర్ లో తొలి పాన్ ఇండియా మూవీ

by admin
0 comment

తనదైన మార్కు డాన్సులతో ఇండియన్ మైఖేల్ జాక్సన్ గా పేరు తెచ్చుకున్న ప్రభుదేవా గత కొంత కాలంగా వరుసగా ఫ్లాపులు చూస్తున్నాడు. అయినా సరే వరుసగా సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాడు. కెరీర్ తొలి నాళ్లలో ప్రేమకథా చిత్రాలతో ఆకట్టుకున్న ప్రభుదేవా ప్రస్తుతం హారర్, థ్రిల్లర్ జోనర్ సినిమాలు చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. దర్శకుడిగానూ తమిళ, తెలుగు, హిందీ భాషల్లో తన సత్తా చాటుకున్న ప్రభుదేవా ప్రస్తుతం ఓల్ఫ్ అనే యాక్షన్ థ్రిల్లర్ చేస్తున్నాడు. ప్రభుదేవా నటిస్తున్న 60వ సినిమా ఇది. పాన్ ఇండియా మూవీగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. వినూ వెంకటేష్ దర్శకుడు. రాయ్ లక్ష్మీ, అంజు కురియన్, అనసూయ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

తమిళంలో రూపొందుతున్న ఈ సినిమాని తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో కూడా రిలీజ్ చేయబోతున్నారు. విభిన్నమైన కథ, కథనాలతో రూపొందుతున్న ఈ మూవీకి సంబంధించి తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. నిమిషం నిడివి ఉన్న ఈ టీజర్, ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. రెడ్ కలర్ డ్రెస్ లో ఓ సమూహం ముందు విచిత్రమైన విగ్రహం ముందు కూర్చుని అనసూయ ధ్యానం చేస్తున్న విజువల్స్ తో టీజర్ ప్రారంభమైంది. పురాతన కాలం నాటు ఓ గ్రామం.. విచిత్ర వేషధారణతో అమ్మాయిలు.. అవయవాలు ఎందుకు తీస్తున్నారు?.. ఇంతకీ వీరి లక్ష్యం ఏంటీ? ..ఎవరు వీరంతా?.. అనసూయ తన సమూహంతో ఏం చేస్తోంది?.. లక్ష్మీరాయ్ కూడా తనతో కలిసి ఏం చేసింది? ఈ మొత్తం ఎపిసోడ్ లో ప్రభుదేవా పాత్ర ఏంటనేది ఆసక్తికరంగా ఉంది. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తారు.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links