svsc prabhas
Home » పేకాటలో బిజీబిజీగా పెద్దోడు చిన్నోడు- మరోవైపు సలార్ అప్‌డేట్‌

పేకాటలో బిజీబిజీగా పెద్దోడు చిన్నోడు- మరోవైపు సలార్ అప్‌డేట్‌

by admin
0 comment

సినిమా ఇండస్ట్రీలో దీపావళి సెలబ్రేషన్స్‌ స్టార్‌ అయ్యాయి. మరోవారం రోజుల్లో రానున్న పండుగను పురస్కరించుకుని తారలు తమ కుటుంబసభ్యులతో సందడి చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో టాలీవుడ్‌లో జరిగిన దీపావళీ పార్టీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. పార్టీని కృష్ణారెడ్డి, సుధారెడ్డి ఏర్పాటు చేయగా.. స్టార్‌ హీరోలు మహేశ్‌ బాబు, రామ్‌ చరణ్‌, వెంకటేశ్‌ తదితరులు ఫ్యామిలీతో హాజరయ్యారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను మహేశ్‌ భార్య నమ్రత సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఈ పార్టీలో మహేష్‌-వెంకటేశ్‌ కలిసి సరదాగా పేకాట ఆడారు. మరి ఈ ఆటలో పెద్దోడు గెలిచాడా లేదా చిన్నోడు గెలిచాడా అని నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. వీరిద్దరు ‘సీతమ్మవాకిట్లో సిరిమల్ల చెట్టు’ సినిమాలో పెద్దోడు-చిన్నోడుగా అలరించిన సంగతి తెలిసిందే.

మరోవైపు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘సలార్‌’ ట్రయిలర్‌ డేట్‌ ఫిక్స్‌ అయినట్లు తెలుస్తోంది. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్‌ సలార్‌. అయితే ఈ సినిమా ట్రైలర్‌ను నవంబర్ చివరి వారంలో లేదా డిసెంబర్ మొదటి వారంలో రిలీజ్ చేసేలా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే రిలీజ్‌ అయిన టీజర్‌ సలార్‌పై అంచనాలను రెట్టింపు చేసింది. అభిమానులు కోరుకునే అన్ని మాస్‌ అంశాలను పుష్కలంగా మేళవించి ‘సలార్‌’ను తీర్చిదిద్దినట్లు అర్థమైంది. శృతి హాసన్ హీరోయిన్‌గా కనిపించనున్న ఈ మూవీలో పృథ్వీ రాజ్, జగపతి బాబు, శ్రియా రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ మూవీకి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links