omlet
Home » ఈ బాహుబలి ఆమ్లెట్ తింటే రూ.లక్ష ఇస్తారు!!

ఈ బాహుబలి ఆమ్లెట్ తింటే రూ.లక్ష ఇస్తారు!!

by admin
0 comment

దిల్లీలోని ఓ వీధి వ్యాపారి ఇచ్చే ఆఫర్‌ నెట్టింట్లో వైరల్‌గా మారుతోంది. తాను వేసిన ఆమ్లెట్‌ను 30 నిమిషాల్లో తింటే ఏకంగా లక్ష రూపాయలు ఇస్తానంటూ ఆ వీధి వ్యాపారి ఆఫర్‌ చేశాడు. అయితే అది నార్మల్ ఆమ్లెట్ కాదు బాహుబలి ఆమ్లెట్‌. దీన్ని 31 గుడ్లతో వేస్తారు. అంతేకాదు టమాటోలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలతో పాటు కబాబ్‌, కూరగాయల ముక్కలు, చీజ్‌, పనీర్‌తో తయారు చేస్తారు. ఈ ఆమ్లెట్‌ ధర 1320 రూపాయిలు. అయితే ఇందులో సుమారు మూడున్నర కేజీల కొవ్వు పదార్థాలున్నాయని ఫిట్నెస్ లవర్ చిరాగ్ బర్జాత్యాయ ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. మరోవైపు ఈ ఆమ్లెట్ పై మిశ్రమ స్పందన వస్తోంది. రూ.లక్ష కోసం ఒకసారి ట్రై చేద్దామని కొందరు అంటుంటే.. మరికొందరు ఆరోగ్యం ముఖ్యమంటూ కామెంట్లు చేస్తున్నారు.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links