rashi nabha
Home » Heroines Personal Interests – స్టార్ హీరోయిన్ల వ్యక్తిగత అభిరుచులు

Heroines Personal Interests – స్టార్ హీరోయిన్ల వ్యక్తిగత అభిరుచులు

by admin
0 comment

నిత్యం బిజీగా ఉండే హీరోయిన్లు, ఫ్రీ టైమ్ దొరికితే ఏం చేస్తారు? ఆ టైమ్ లో తమకు ఇష్టమైన వ్యాపకాన్ని ఎంచుకుంటారు? మనసుకు నచ్చే పనులు చేస్తారు. మరి పూజాహెగ్డే, సమంత, జాన్వికపూర్ లాంటి హీరోయిన్ల వ్యక్తిగత అభిరుచులేంటో చూద్దాం..

సమంత హాబీ ఏంటో చాలామందికి తెలిసే ఉంటుంది. అవును.. టెర్రస్ గార్డెనింగ్ ఈమె హాబీ. తనే సొంతంగా కూరగాయలు పండించుకొని, వాటినే వండుకొని తినడం సమంతకు ఇష్టం. క్యారెట్, క్యాప్సికమ్, బెండకాయలతో పాటు ఎన్నో రకాల ఆకుకూరలు, కూరగాయలు పండిస్తోంది సమంత.

మిల్కీబ్యూటీ తమన్న హాబీ ఏంటో తెలుసా..? ఈమెకు జ్యూవెలరీ సేకరించడం హాబీ. ఈమె తండ్రి వజ్రాల వ్యాపారి. బహుశా, అలా ఆమెకు ఈ అలవాటు వచ్చి ఉంటుంది. ఎయిర్ పోర్టుల్లో ఫ్రీ టైమ్ దొరికినప్పుడు, షూటింగ్స్ కోసం విదేశాలకు వెళ్లినప్పుడు రకరకాల డిజైన్స్ తో ఉండే ఆభరణాలు కొనడం తమన్న హాబీ.

రెజ్యూమ్ రాసేటప్పుడు రీడింగ్ బుక్స్ అని రాసేయడం చాలా కామన్. కానీ కాజల్ మాత్రం ఈ విషయంలో చాలా సీరియస్. ఆమెకున్న ఏకైక హాబీ పుస్తక పఠనం. వారానికో నవల ఈజీగా చదివేస్తుంది. లాక్ డౌన్ టైమ్ లో ఎన్ని బుక్స్ చదివిందో లెక్కలేదు. ఇప్పటికీ మంచి పుస్తకం ఏదైనా చదవాలనుకుంటే చాలామంది హీరోహీరోయిన్లు కాజల్ సలహా తీసుకుంటారు.

పూజా హెగ్డేకు సాగర తీరాలంటే చాలా ఇష్టం. ఫ్రీ టైమ్ దొరికితే బీచ్ లో గడపడం ఈమె హాబీ. జాగ్రత్తగా గమనిస్తే ఆమె వ్యక్తిగత ఫొటోలు ఎక్కువగా బీచ్ బ్యాక్ గ్రౌండ్ లోనే కనిపిస్తాయి. షూటింగ్స్ కోసం విదేశాలకు వెళ్తే, పూజా హెగ్డే ముందుగా చేసే పని దగ్గర్లో బీచ్ ఎక్కడుందా అని వెదుక్కోవడం.

నివేత పెతురాజ్ కు క్రీడలంటే ఇష్టం. చిన్నప్పుడు ఫుట్ బాల్ ఎక్కువగా ఆడేది. ప్రస్తుతం కారు రేసులపై మనసు పారేసుకుంది. ఆమధ్య ఫార్ములా రేస్ కారు ట్రైనింగ్ ప్రొగ్రామ్ లో లెవెల్-1 సర్టిఫికేట్ కూడా పొందింది. దీంతో పాటు కార్లు సేకరించడం కూడా హాబీ. ఈమె దగ్గర డాడ్జ్ ఛాలెంజర్ కూడా ఉంది.

తెరపై ఎంత హాట్ గా కనిపిస్తుందో, నిజజీవితంలో అంత సెన్సిటివ్ గా ఉంటుంది జాన్వికపూర్. ఈమె వేసే పెయింటిగ్స్ చూస్తే ఆ విషయం అర్థమౌతుంది. అవును.. జాన్వి కపూర్ హాబీ పెయింటింగ్. ఇప్పటికే చాలా పెయింటింగ్స్ వేసింది. కొన్నింటిని బయటపెట్టింది. మరికొన్నింటిని దాచేసింది. వాటితో ఎగ్జిబిషన్ పెట్టాలనేది పాప ఆలోచన.

నభా నటేష్ కు కూడా పెయింటింగ్ అంటే హాబీ. లాక్ డౌన్ టైమ్ లో ఓవైపు అందాన్ని కాపాడుకుంటూనే, మరోవైపు తన మనసుకు ఎంతో ఇష్టమైన పెయింటింగ్ హాబీని కొనసాగించింది. 2-3 రోజులు షూటింగ్ గ్యాప్ వస్తే పెయింట్ బ్రష్ పట్టుకోవడమే తన తొలి ప్రాధాన్యం అంటోంది.

సమంతలానే కంగనా రనౌకు కూడా గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. అయితే సమంత తన కోసం ఆకుకూరలు, కూరగాయలు పండించుకుంటుంది. కంగనా మాత్రం పూల మొక్కలు పెంచుతుంది. రంగురంగుల పూలమొక్కలు ఇంటి చుట్టూ పెంచుతుంది. ఈ విషయంలో అమ్మే తనకు మార్గదర్శి అంటోంది కంగనా.

హీరోయిన్లలో తిండిబోతులు తక్కువగా ఉంటారు. ఎక్కువగా తింటే లావెక్కిపోతామనే భయం వీళ్లది. కానీ పాయల్ రాజ్ పుత్ మాత్రం దీనికి రివర్స్. రకరకాల వంటకాలు టేస్ట్ చేయడం ఈమె హాబీ. సమయం దొరికితే చాలు బాయ్ ఫ్రెండ్ తో కలిసి రెస్టారెంట్లు చుట్టేస్తుంది. ఇప్పటికే ఎన్నో దేశీ వంటకాల్ని టేస్ట్ చేసిన పాయల్, ప్రస్తుతం మిడిల్-ఈస్ట్ రుచులపై మనసు పారేసుకుంది.

రాశీఖన్నాకు గతంలో ఏ హాబీ ఉండేదో తెలియదు కానీ, రెండేళ్లుగా మాత్రం ఆమె హాబీ గిటార్. మొదటి లాక్ డౌన్ లో గిటార్ నేర్చుకుంది రాశిఖన్నా. అప్పట్నుంచి దాన్ని తన వెంటే తీసుకెళ్తోంది. సమయం దొరికినప్పుడల్లా గిటార్ ప్లే చేస్తూ మంచి పాట పాడుతుంటుంది.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links