plan
Home » crime: లండన్‌ నుంచి భార్య కుటుంబంపై విషప్రయోగం

crime: లండన్‌ నుంచి భార్య కుటుంబంపై విషప్రయోగం

by admin
0 comment

హైటెక్‌ ప్లాన్‌తో భార్య కుటుంబాన్ని మట్టుబెట్టాలని ఓ భర్త లండన్‌ నుంచి ప్రయత్నించాడు. ఈ ఘటనలో అత్త ప్రాణాలు కోల్పోయింది. బాధితులు పోలీసులను ఆశ్రయించగా అసలు విషయం బయటపడింది. హైదరాబాద్‌లో మియాపూర్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మియాపూర్‌ గోకుల్‌ ఫ్లాట్స్‌లో నివాసముండే హన్మంతరావు, ఉమామహేశ్వరి దంపతుల కుమార్తె శిరీషకు అజిత్‌కుమార్‌తో 2018లో వివాహమైంది. ఉద్యోగరీతా వీరిద్దరూ లండన్‌లో స్థిరపడ్డారు. అయితే వీరికి కుమార్తె జన్మించిన కొంతకాలానికి ఇద్దరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఆమె లండన్‌లోనే పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. అనంతరం వీరిద్దరు వేర్వేరుగా ఉంటున్నారు.

అయితే కోపం పెంచుకున్న అజిత్‌.. భార్యతో పాటు ఆమె కుటుంబాన్ని మట్టుబెట్టాలని ప్లాన్‌ చేశాడు. వారిద్దరి కామన్‌ ఫ్రెండ్స్‌తో పాటు భార్య బంధువులు, అపార్టెమెంట్ వాచ్‌మన్‌ కుమారుడు రమేష్‌ సాయం తీసుకున్నాడు. ఈ క్రమంలో సోదురుడి వివాహానికి లండన్‌ నుంచి శిరీష, కుమారై మియాపూర్‌కు వచ్చారు. దీన్ని అవకాశంగా మలుచుకోని తొలిప్రయత్నం చేయించాడు. అయితే పాయిజిన్‌ ఇంజక్షన్లతో చంపాలనుకున్న ఈ ప్లాన్‌ విఫలమైంది.

దీంతో అజిత్ మరో ప్లాన్‌ వేశాడు. విషాన్ని కలిపిన వంట సామాగ్రిని శాంపిల్‌ ప్యాకెట్లుగా డెలివరీబాయ్‌ రూపంలో భార్య కుటుంబానికి అందజేశాడు. వాటిని వినియోగించడంతో ఆరుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలోనే శిరీష తల్లి ఉమామహేశ్వరి జులై 5న మరణించారు. అందుకు ఆమె అనారోగ్యమే కారణమని అంతా భావించారు. అయితే శిరీష, ఆమె తండ్రి, సోదరుడు, మరదలు, బంధువైన మరో మహిళ కాళ్లు, చేతులు స్పర్శ కోల్పోయారు. వారు కోలుకోకపోవడంతో అనుమానమొచ్చి రక్త నమునాలను పరీక్షకు పంపారు. అందులో విష పదార్థాలు ఉన్నట్లు తేలింది. దీంతో బాధితులు మియాపూర్‌ పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన తర్వాత వాచ్‌మన్‌ కుమారుడు రమేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ప్లాన్ గురించి తెలిసింది. అదే అపార్ట్‌మెంట్‌లో శిరీష ఫ్లాట్‌పైనే ఉండే పూర్ణేందర్‌రావును అడగడంతో మొత్తం వ్యవహారం బహిర్గతమైంది. అనంతరం ప్లాన్‌కు సహకరించిన ఆరుగురిని శుక్రవారం వేర్వేరు ప్రాంతాల్లో పోలీసులు అరెస్టు చేశారు. లండన్‌లో ఉన్న ప్రధాన నిందితుడు అజిత్‌ను కూడా అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links