anushka
Home » అనుష్క బర్త్‌డే గిఫ్ట్‌.. హిట్‌ మూవీకి సీక్వెల్‌

అనుష్క బర్త్‌డే గిఫ్ట్‌.. హిట్‌ మూవీకి సీక్వెల్‌

by admin
0 comment

లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలకు కొత్త ఊపిరి పోసింది స్టార్‌ హీరోయిన్‌ అనుష్క శెట్టి. ఎంతో మంది హీరోయిన్స్‌కు స్ఫూర్తిగా నిలిచింది. ఓ యోగాటీచర్‌గా పనిచేసి.. అనుకోకుండా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి స్టార్‌డమ్‌ తెచ్చుకుంది. ‘సాషా’గా పరిచయమైన ఈ ‘సూపర్‌’ హీరోయిన్‌ 42వ బర్త్‌డే ఈరోజు. అయితే ఈ స్పెషల్‌ డే సందర్భంగా తన ఫ్యాన్స్‌కు ఓ గుడ్‌ న్యూస్‌ చెప్పింది స్వీటీ. తన కెరీర్‌లో వన్‌ ఆఫ్‌ ద బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచిన ‘భాగమతి’కి సెకండ్‌ పార్ట్‌ రానుంది. భాగమతి కొనసాగింపుగా మూవీని తెరకెక్కించనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

గ్లామర్‌ పాత్రలతోనే కాకుండా ‘అరుంధతి’, ‘రుద్రమదేవి’, ‘భాగమతి’ లాంటి ఎన్నో విజయవంతమైన సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుందీ అనుష్క. ఇటీవల విడుదలైన ‘మిస్‌శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’లో అన్విత పాత్రలో అభిమానుల హృదయాల్ని గెలుచుకుంది. ‘వేద’ సినిమాలో సరోజ పాత్రలో తన అందం, అభినయంతో యువతను ఉర్రూతలూగించింది. ‘బాహుబలి’ సినిమాలోని దేవసేన పాత్రలో ఆమె నటనతో చిత్రపరిశ్రమలో తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పరచుకుంది. ఇక ‘బాహుబలి 2’ మూవీ చారిత్రక విజయం సాధించింది. ఆ సినిమా తర్వాత అనుష్క ప్రధాన పాత్రలో వచ్చిన సినిమానే ‘భాగమతి’.

తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ద్విభాషా చిత్రంగా తెరకెక్కింది భాగమతి. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా కమర్షియల్‌గా సక్సెస్ అయ్యింది. అనుష్క ఇమేజ్ మరింత పెరగడానికి కారణమైంది. 2018 జనవరి 26న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ఐదేళ్ల తర్వాత ఇప్పుడు రెండో భాగం వస్తోంది.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links