unstoppable
Home » అన్​స్టాపబుల్ ‘యానిమల్’ ఎపిసోడ్‌ డేట్‌ ఫిక్స్‌

అన్​స్టాపబుల్ ‘యానిమల్’ ఎపిసోడ్‌ డేట్‌ ఫిక్స్‌

by admin
0 comment

నందమూరి బాలకృష్ణ ‘అన్​స్టాపబుల్’ షో సీజన్​ -3తో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. తొలి రెండు సీజన్లలో టాలీవుడ్​కు పరిమితమైన ఈ టాకింగ్ షో.. ఇప్పుడు బాలీవుడ్ దాకా వెళ్లింది. ఈ సీజన్​ తొలి ఎపిసోడ్​కు బాలీవుడ్​ స్టార్ హీరో రణ్​బీర్​ కపూర్ అండ్ ‘యానిమల్’ మూవీటీమ్ రానుందని ‘ఆహా’ ఇప్పటికే తెలిపింది. అయితే తాజాగా ఈ ఎపిసోడ్​ స్ట్రీమింగ్​ కానున్న తేదీని అధికారికంగా ప్రకటించింది ‘ఆహా’. ఈ బిగ్గెస్ట్​ ఎపిసోడ్​ నవంబర్ 24 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ ఎపిసోడ్​లో హీరో రణ్​బీర్​తోపాటు హీరోయిన్ రష్మిక మందన్నా, డైరెక్టర్ సందీప్​రెడ్డి వంగ కూడా పాల్గొన్నారు. ఈ ఎపిసోడ్​ ప్రోమో వచ్చినప్పటి నుంచి.. బాలీవుడ్ హీరోతో బాలయ్య సంభాషణలు ఎలా సాగాయి? అంటూ ఫ్యాన్స్​లో ఆసక్తి నెలకొంది. యూనియల్ మూవీ డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా.. హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links