pm modi
Home » TS,APలో 39 రైల్వేస్టేషన్ల అభివృద్ధికి ప్రధాని శంకుస్థాపన

TS,APలో 39 రైల్వేస్టేషన్ల అభివృద్ధికి ప్రధాని శంకుస్థాపన

by admin
0 comment

అమృత భారత్‌ పథకంలో భాగంగా దేశంలోని 508 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. తొలిదశలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 39 రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేయనున్నారు. తెలంగాణ రూ.894.09 కోట్లతో 21 స్టేషన్లు, ఏపీలో 453.50 కోట్లతో 18 స్టేషన్లలో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.

శంకుస్థాపన అనంతరం ప్రధాని మోదీ మాట్లాడారు. దేశ రైల్వే చరిత్రలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టామని అన్నారు. రైల్వే స్టేషన్ల వద్ద షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, గేమింగ్‌ జోన్‌లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అభివృద్ధి అనంతరం రైల్వే స్టేషన్లు మల్టీ మోడల్‌ హబ్‌గా మారతాయని అన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి చేసే స్టేషన్ల వివరాలు
తెలంగాణ: ఆదిలాబాద్‌, భద్రాచలం రోడ్‌, హఫీజ్‌పేట, హైటెక్‌సిటీ, ఉప్పుగూడ, హైదరాబాద్‌, జనగామ, కామారెడ్డి, కరీంనగర్‌, కాజీపేట, ఖమ్మం, మధిర, మహబూబ్‌నగర్‌, మహబూబాబాద్‌, మలక్‌పేట, మల్కాజిగిరి, నిజామాబాద్‌, రామగుండం, తాండూరు, యాదాద్రి (రాయగిరి), జహీరాబాద్‌.

ఆంధ్రప్రదేశ్‌: పలాస, విజయనగరం, అనకాపల్లి, దువ్వాడ, భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం, నిడదవోలు, తెనాలి, రేపల్లె, పిడుగురాళ్ల, కర్నూలు, కాకినాడ టౌన్‌, ఏలూరు, తుని, ఒంగోలు, సింగరాయకొండ, దొనకొండ.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links