cheetahs
Home » Tirumala: అలిపిరిలో మరో 5 చిరుతల అలజడి

Tirumala: అలిపిరిలో మరో 5 చిరుతల అలజడి

by admin
0 comment

తిరుమల అలిపిరి కాలినడక పరిసరాల్లో చిరుతలు అలజడి సృష్టిస్తున్నాయి. ఏడో మైలు, నామాలగవి, లక్ష్మీనరసింహస్వామి ఆలయ పరిసరాల్లో అయిదు చిరుతులు సంచరిస్తున్నాయని అటవీ శాఖ అధికారులు తెలిపారు. ట్రాప్‌ కెమెరాల్లో చిరుతల ఫుటేజీ రికార్డు అయ్యిందని వెల్లడించారు. మరోవైపు శ్రీవారి మెట్టు నడకమార్గంలో ఎలుగుబంటి సంచారం కలకలం సృష్టించింది. సోమవారం ఉదయం 2వేల మెట్టు వద్ద భక్తులకు ఎలుగుబంటి కనిపించింది. వెంటనే భక్తులు అటవీశాఖ, తితిదే విజిలెన్స్‌ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఈ సంఘటనల నేపథ్యంలో భక్తుల భద్రతపై టీటీడీ, అటవీశాఖ ఉన్నతాధిరులు సమీక్షించనున్నారు.

కాగా, ఇటీవల చిరుత దాడిలో చిన్నారి మృతి చెందిన సంగతి తెలిసిందే. గత నెల రోజుల వ్యవధిలోనే ఇద్దరు చిన్నారులపై చిరుత దాడికి పాల్పడింది. దీంతో కాలినడక మార్గ పరిసరాల్లోని అటవి ప్రాంతంలో చిరుతలను బంధించడం కోసం బోనులు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో అలిపిరి మార్గంలోని ఏడో మైలు వద్ద ఏర్పాటు చేసిన బోనులో సోమవారం ఓ చిరుత చిక్కింది. కాగా, ఈ చిరుతను తిరుపతి ఎస్వీ జూ పార్కుకు తరలిస్తామని అధికారులు తెలిపారు.

చిన్నారుల భక్తుల భద్రతా దృష్ట్యా ఇప్పటికే టీటీడీ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 15 ఏళ్ల లోపు చిన్నారులకు ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే అనుమతిస్తున్నట్లు ప్రకటించింది.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links