dutch
Home » నెదర్లాండ్స్‌ సంచలనం – అప్పట్లో అతడు దక్షిణాఫ్రికా వాడే!

నెదర్లాండ్స్‌ సంచలనం – అప్పట్లో అతడు దక్షిణాఫ్రికా వాడే!

by admin
0 comment

వన్డే ప్రపంచకప్‌ ఆసక్తికరంగా సాగుతోంది. ఇంగ్లాండ్‌పై అఫ్గాన్‌ విజయాన్ని మరవకముందే మరో సంచలనం నమోదైంది. దక్షిణాఫ్రికాపై నెదర్లాండ్స్‌ 38 పరుగుల తేడాతో గెలిచింది. వరుణుడి ఆటంకంతో ఈ మ్యాచ్ ను 43 ఓవర్లకు కుదించిన ఈ మ్యచ్ లో తొలుత నెదర్లాండ్స్ బ్యాటింగ్ చేసింది. ఎనిమిది వికెట్లు కోల్పోయి 245 పరుగులు చేసింది. కెప్టెన్ ఎడ్వర్డ్స్ (78) గొప్పగా ఆడాడు. అనంతరం ఛేదనకు వచ్చిన దక్షిణాఫ్రికా 207 పరుగులకే కుప్పకూలింది. మిల్లర్ (43), మహరాజ్ (40) టాప్ స్కోరర్లు.

అయితే డచ్‌జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ‘వాన్‌ డెర్‌ మెర్వే’ గతంలో దక్షిణాఫ్రికా తరఫున ఆడాడు. 2009లో ఇంటర్నేషనల్‌ కెరీర్‌ ఆరంభించిన అతడు సౌతాఫ్రికా తరఫున 13 వన్డేలు, 13 టీ20లు ఆడాడు. తర్వాత దక్షిణాఫ్రికా జట్టులో ఎక్కువగా అవకాశాలు రాకపోవడంతో 2015లో నెదర్లాండ్స్‌ జట్టులో చేరాడు. అప్పటి నుంచి డచ్‌ విజయాల్లో మెర్వే కీలకపాత్ర పోషిస్తున్నాడు. రీసెంట్ మ్యాచ్‌లో 19 బంతుల్లో 29 పరుగులతో పాటు.. 9 ఓవర్లు వేసి 34 పరుగులిచ్చి రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా దక్షిణాఫ్రికా ఓటమికి ప్రధాన కారణం అయ్యాడు.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links