chiru
Home » త్రిషకే కాదు.. ప్రతి ఆడబిడ్డకు అండగా ఉంటా- చిరంజీవి

త్రిషకే కాదు.. ప్రతి ఆడబిడ్డకు అండగా ఉంటా- చిరంజీవి

by admin
0 comment

యాక్టర్‌ మన్సూర్‌ అలీఖాన్‌.. హీరోయిన్‌ త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే . ‘‘గతంలో ఎన్నో మూవీస్‌లో రేప్‌ సీన్లలో నటించా. ‘లియో’లో ఆఫర్‌ వచ్చినప్పుడు త్రిషతోనూ అలాంటి సీన్‌ ఉంటుందనుకున్నా. కానీ, లేకపోవడంతో బాధగా అనిపించింది’’ అని మన్సూర్‌ అన్నాడు. ఈ వ్యాఖలను ఖండిస్తూ పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పోస్ట్‌లు పెడుతున్నారు. తాజాగా త్రిషకు మద్దతుగా మెగాస్టార్‌ నిలిచారు. ”త్రిషపై మన్సూర్‌ చేసిన వ్యాఖ్యలు నా దృష్టికి వచ్చాయి. వక్రబుద్ధితో ఇలా మాట్లాడుతున్నారు. ఒక నటిని మాత్రమే కాదు.. ఏ ఆడబిడ్డని ఇలా అనకూడదు. వీటిని తీవ్రంగా ఖండించాలి. త్రిషతో పాటు ప్రతి ఒక్కరికి అండగా ఉంటా” అని చిరంజీవి ట్వీట్ చేశారు. మరోవైపు మన్సూర్‌ వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్‌ సీరియస్‌గా తీసుకుంది. మన్సూర్‌పై కేసు నమోదు చేయాలని తమిళనాడు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links