karthika
Home » వైభవంగా హీరోయిన్‌ కార్తీక పెళ్లి

వైభవంగా హీరోయిన్‌ కార్తీక పెళ్లి

by admin
0 comment

సీనియర్‌ నటి రాధ కుమార్తె, ‘రంగం’ ఫేమ్‌ హీరోయిన్ కార్తీక వివాహం ఆదివారం వైభవంగా జరిగింగి. రోహిత్‌ మేనన్ తో కార్తీక ఏడడుగులు వేశారు. తిరువనంతపురంలోని ఓ కన్వెన్షన్‌ సెంటర్‌లో కేరళ సంప్రదాయ పద్ధతిలో వీరి పెళ్లి జరిగింది. ఈ వివాహానికి ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితులతోపాటు మెగాస్టార్‌ చిరంజీవి–సురేఖ దంపతులు, నటీనటులు రాధిక, సుహాసిని, రేవతి, భాగ్యరాజ్‌ తదితరులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. నాగచైతన్య హీరోగా రూపొందిన ‘జోష్‌’ సినిమాతో తెలుగులో హీరోయిన్ గా అడుగుపెట్టింది కార్తీక. తెలుగుతో పాటు మలయాళం, తమిళ చిత్రాల్లో కూడా కార్తీక నటించింది. ఆమె కెరీర్ లో ‘రంగం’ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. 2015 తర్వాత ఆమె సినిమాలకు దూరంగా ఉంటూ వ్యాపార రంగంలో బిజీ అయ్యారు.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links