mathews
Home » క్రికెట్ చరిత్రలోనే తొలిసారి ‘టైమ్డ్‌ ఔట్‌’

క్రికెట్ చరిత్రలోనే తొలిసారి ‘టైమ్డ్‌ ఔట్‌’

by admin
0 comment
  • 3 నిమిషాల లోపు క్రీజులోకి రాలేకపోవడంతో మాథ్యూస్‌ ఔట్‌
  • బంగ్లాదేశ్‌-శ్రీలంక మ్యాచ్‌లో ఈ అరుదైన సంఘటన
  • బంగ్లా కెప్టెన్‌ షకీబ్‌ అపీల్‌పై నెట్టింట్లో విమర్శలు

దిల్లీ వేదికగా జరుగుతున్న బంగ్లాదేశ్‌-శ్రీలంక మ్యాచ్‌లో అరుదైన సంఘటన జరిగింది. ‘టైమ్డ్‌ అవుట్‌’ లోపు క్రీజులోకి అడుగుపెట్టని కారణంగా లంక ప్లేయర్‌ మాథ్యూస్‌ను అంపైర్లు ఔట్‌గా ప్రకటించారు. ఈ తరహాలో ఓ ఆటగాడు ఔటవ్వడం క్రికెట్ చరిత్రలోనే తొలిసారి. అసలేం జరిగిందంటే.. సమరవిక్రమ ఔటైనా తర్వాత మాథ్యూస్‌ మైదానంలోకి అడుగుపెట్టాడు. కానీ మాథ్యూస్‌ తన హెల్మెట్‌కు బదులుగా మరో హెల్మెట్‌ తీసుకోనివచ్చాడు. దీంతో డగౌట్‌లో ఉన్న తన సహచర ప్లేయర్లకు ఈ విషయాన్ని తెలియజేశాడు. అయితే సరైన హెల్మెట్ వచ్చేలోపు.. బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ షకిబ్‌అల్‌హసన్‌ టైమ్డ్‌ అవుట్‌పై అంపైర్లకు అపీలు చేశాడు. దీంతో అంపైర్లు మాథ్యూస్‌ను ఔట్‌ అని ప్రకటించారు. 40.1.2 నిబంధన ప్రకారం.. మూడు నిమిషాల లోపు కొత్త బ్యాటర్‌ క్రీజులోకి రావాలి. ఈ నిబంధన మేరకు ఔట్‌ అని అంపైర్లు వివరించారు. అయితే షకిబ్‌ తన అపీల్‌ను ఉపసంహరించుకుంటాడని లంక ప్లేయర్లు భావించినా.. చివరికి నిరాశే మిగిలింది. మరోవైపు సోషల్‌మీడియాలో ఈ ఔట్‌ గురించి పెద్దఎత్తున చర్చ సాగుతోంది. అపీల్‌ను వెనక్కీ తీసుకోకపోవడంపై బంగ్లా కెప్టెన్‌ షకిబ్‌పై విమర్శలు వస్తున్నాయి.

మరోవైపు శ్రీలంక క్రికెట్‌లో సంక్షోభం ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో శ్రీలంక ప్లేయర్‌ ఇలా ఔటవ్వడంతో లంక ఫ్యాన్స్‌ తీవ్ర నిరాశలోకి మునిగిపోయారు. వన్డే ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శన, క్రికెట్ బోర్డులో మితిమీరిన అవినీతితో శ్రీలంక క్రికెట్ బోర్డును రద్దు చేస్తూ.. ఆ దేశ క్రీడా శాఖ మంత్రి రోషన్‌ రణసింగే సంచలన నిర్ణయాన్ని తీసుకున్న సంగతి తెలిసిందే. 1996లో ప్రపంచకప్‌ అందించిన అర్జున రణతంగ నేతృత్వంలో తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేశారు. ఏడు మందితో కూడిన ఈ బృందంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కూడా ఉన్నారు.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links