aamir
Home » అమిర్‌ఖాన్ ఇంట్లో పెళ్లి సందడి

అమిర్‌ఖాన్ ఇంట్లో పెళ్లి సందడి

by admin
0 comment

బాలీవుడ్‌ స్టార్‌ హీరో ఆమిర్‌ఖాన్‌ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. ఆయన కుమార్తె ఐరా ఖాన్‌ పెళ్లి వేడుకలు షురూ అయ్యాయి. మంగళవారం ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌ స్టార్ట్‌ చేశారు. కాబోయే వధూవరుల కుటుంబాలు.. ఒకేచోట కలిసి కెల్వన్‌ ప్రోగ్రామ్‌ నిర్వహించాయి. వధూవరులిద్దరూ సంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. మహారాష్ట్ర సంప్రదాయం ప్రకారం పెళ్లి పనులు కెల్వన్‌తో మొదలవుతాయి. ఇరు కుటుంబసభ్యులు విందు భోజనాలు ఏర్పాటు చేసి, కానుకలు ఇచ్చిపుచ్చుకుంటారు. ఇక నుపుర్‌-ఐరాఖాన్‌.. ప్రేమించి పెళ్లి చేసుకుంటున్న విషయం తెలిసిందే. గత కొన్నేళ్ల నుంచి ఆమిర్‌ ఖాన్‌కు నుపుర్‌ వ్యక్తిగత ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా ఉన్నాడు. ఐరా సైతం నుపుర్‌ వద్ద ఫిట్‌నెస్‌ పాఠాలు నేర్చుకుంది. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్‌ ఏర్పడింది. తర్వాత అది ప్రేమగా మారింది. 2020 నుంచే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. గతేడాది నవంబర్‌లో వీరి నిశ్చితార్థం జరిగింది.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links