navadeep
Home » Navdeep – నవదీప్‌ను అరెస్టు చేయొద్దు: హైకోర్టు

Navdeep – నవదీప్‌ను అరెస్టు చేయొద్దు: హైకోర్టు

by admin
0 comment

టాలీవుడ్‌లో డ్రగ్స్‌ కేసు కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ కేసులో హీరో నవదీప్‌ ఉన్నట్టు వార్తలు వచ్చాయి. నవదీప్‌ను A29గా పేర్కొంటూ సీపీ సీవీ ఆనంద్‌ ప్రెస్‌మీట్‌లో వెల్లడించారు. అయితే పోలీసులు నవదీప్‌ అనే పేరు మాత్రమే చెప్పారని, యాక్టర్‌ నవదీప్‌ అని పేర్కొనలేదని హీరో నవదీప్‌ దీనిపై స్పందించాడు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధంలేదని వివరించాడు. కాగా, ఈ విషయంపై పెద్దఎత్తున చర్చ సాగుతుండగా.. హీరో నవదీప్‌ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు. ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని హైకోర్టును కోరాడు. దీనిపై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈనెల 19వ తేదీ వరకు నవదీప్‌ను అరెస్టు చేయొద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links