ram charan
Home » రామ్‌ చరణ్‌ సినిమాలో బిగ్‌బాస్‌ 7 కంటెస్టెంట్‌

రామ్‌ చరణ్‌ సినిమాలో బిగ్‌బాస్‌ 7 కంటెస్టెంట్‌

by admin
0 comment

రామ్‌చరణ్‌ కథానాయకుడిగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో బిగ్‌బాస్‌7 కంటెస్టెంట్‌ అంబటి అర్జున్‌ అవకాశం దక్కించుకున్నాడు. ఈ విషయాన్ని డైరెక్టర్ బుచ్చిబాబు బిగ్‌బాస్‌ హౌస్‌లో వెల్లడించాడు. నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ రియాలిటీ షోకి అర్జున్‌ వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ద్వారా వెళ్లిన సంగతి తెలిసిందే. దీపావళిని పురస్కరించుకుని నాగార్జున.. కంటెస్టెంట్‌ల బంధువులు, స్నేహితులు, పలువురు సినీ ప్రముఖులను ఆహ్వానించారు. ఇందులో భాగంగా బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లిన బుచ్చిబాబు అర్జున్‌ తో.. ”రామ్‌ చరణ్‌ సర్‌ సినిమాలో సూపర్‌ క్యారెక్టర్‌ చేయబోతున్నావ్‌. ఫిక్స్‌ అయిపో” అంటూ అనౌన్స్‌ చేశాడు. ‘ఉప్పెన’తో బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకున్నాడు డైరెక్టర్‌ బుచ్చిబాబు. ఇక రామ్‌ చరణ్‌తో చేసే సినిమాకి ఎ.ఆర్‌. రెహమాన్‌ సంగీతం అందించనున్నాడు.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links