highway
Home » Electric Highway – త్వరలో విద్యుత్‌ రహదార్లు.. అంటే ఏంటి?

Electric Highway – త్వరలో విద్యుత్‌ రహదార్లు.. అంటే ఏంటి?

by admin
0 comment

విద్యుత్‌ రహదారుల అభివృద్ధికి మార్గాలు, సాంకేతికతలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. నాగ్‌పూర్‌లో ప్రయోగాత్మకంగా ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు తెలిపారు. విద్యుత్‌ మంత్రిత్వ శాఖతో మాట్లాడానని, ఒక్కో యూనిట్‌ రూ.3.50కే విద్యుత్‌ను సరఫరా చేసేలా ప్రయత్నిస్తున్నాని పేర్కొన్నారు. వాణిజ్యంగా ఈ ధర రూ.11గా ఉంటుందని అన్నారు. ఎలక్ట్రిక్‌ తీగల నిర్మాణం ప్రైవేట్‌ రంగ పెట్టుబడిదార్లు చేపడతారని, టోల్‌ మాదిరిగా విద్యుత్‌ ఛార్జీని NHIA వసూలు చేస్తుందని మంత్రి వివరించారు.

అసలు విద్యుత్ రహదార్లు అంటే ఏంటి? విద్యుత్‌ రైళ్ల పట్టాలకు సమాంతరంగా ఎలాగైతే పైన విద్యుత్‌ సరఫరా తీగలు ఉంటాయో అదే తరహాలోనే రహదారులపైనా తీగలను అమరుస్తారు. వాహనాలు ఈ తీగల నుంచి ప్రసారమయ్యే విద్యుత్‌ సాయంతో రహదారులపై నడుస్తాయి. ఆ విధంగా వాహనాల్లోనూ, విద్యుత్‌ తీగల లైన్లలో సాంకేతికతను ఏర్పాటు చేస్తారు.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links