237
మ్యాచ్ ఆలస్యం కాకుండా, ఓవర్ల మధ్య టైమ్ వేస్ట్ కాకుండా, ఆట వేగాన్ని మరింత పెంచడానికి.. ఐసీసీ కొత్త రూల్‌ను తీసుకువచ్చింది. ఓవర్ పూర్తయిన 60 సెకన్ల లోపు ఫీల్డింగ్ జట్టు తర్వాతి ఓవర్ మొదలుపెట్టాలి. అలా చేయడంలో ఫీల్డింగ్ జట్టు మూడో సారి విఫలమైతే.. ఆ జట్టుకు 5 పరుగులు పెనాల్టీ విధించనుంది. వన్డే, టీ20 ఫార్మాట్‌లో ఈ కొత్త రూల్ మొదలుకానుంది. డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. దాని కోసం స్టాప్ క్లాక్‌ను అందుబాటులోకి తెస్తున్నారు. మరోవైపు పిచ్ నిషేధించే రూల్స్‌లోనూ ఐసీసీ కీలక మార్పులు చేసింది. అయిదేళ్ల కాలంలో ఒక పిచ్ అయిదు అయోగ్యతా పాయింట్లు పొందితే నిషేధానికి గురయ్యేది. ఇప్పుడు ఆ పాయింట్లను ఆరుకు పెంచింది.