worldcup
Home » CWC2023- ప్రపంచ సమరంలో ఎవరి బలమెంత?

CWC2023- ప్రపంచ సమరంలో ఎవరి బలమెంత?

by admin
0 comment

క్రికెట్‌ పండగ మొదలైంది. నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్న వన్డే వరల్డ్‌ కప్‌ వచ్చేసింది. సొంతగడ్డపై ధమకా షురూ అయ్యింది. 2019 ప్రపంచకప్‌ మాదిరిగానే ఈ సారి పది జట్లు పాల్గొంటున్నాయి. రౌండ్ రాబిన్‌ పద్ధతిలో ఈ టోర్నీ జరుగుతుంది. ప్రతి జట్టు మిగతా తొమ్మిది జట్లతో పోటీ పడాల్సి ఉంటుంది. గెలిచిన ప్రతిజట్టుకు రెండు పాయింట్లు లభిస్తాయి. ఫలితం తేలకపోతే పాయింట్లు సమానంగా పంచుకుంటాయి. రౌండ్‌రాబిన్‌ ముగిశాక పాయింట్ల పట్టికలో టాప్‌-4లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. ఇందులో నెగ్గిన జట్లు టైటిల్ కోసం ఫైనల్లో తలపడతాయి. మొత్తంగా 45 గ్రూప్‌ మ్యాచ్‌లు, రెండు సెమీస్‌, ఒక ఫైనల్‌ జరుగుతాయి. అయితే టీమ్స్‌ బలాలు, బలహీనతలు ఎలా ఉన్నాయో చూద్దాం.

భారత్‌
బలాలు
1. టాప్‌ ఆర్డర్‌ రోహిత్‌, గిల్‌, కోహ్లి
2. సిరాజ్‌ సూపర్‌ ఫామ్‌, బుమ్రా రీఎంట్రీ
3. సొంత మైదానాలు, అభిమానుల మధ్య ఆట

బలహీనతలు
1. నాకౌట్‌ మ్యాచ్‌ల్లో తడబడటం
2. కీలక క్యాచ్‌లు చేజార్చడం
3. ఎడమచేతి వాటం పేసర్లు లేకపోవడం

ఆస్ట్రేలియా
బలాలు
1. లోతైన బ్యాటింగ్‌
2. స్టార్ ఆల్‌రౌండర్లు మిచెల్‌ మార్ష్‌, మాక్స్‌వెల్‌
3. మెగాటోర్నీల్లో ఒత్తిడిని జయించే అనుభవం

బలహీనతలు
1. ఫామ్‌లేని బ్యాటర్లు
2. జంపా తప్ప స్పెషలిస్ట్‌ స్పిన్నర్లు లేకపోవడం
3. ఆఖర్లో ధారాళంగా పరుగులు ఇవ్వడం

ఇంగ్లాండ్‌
బలాలు
1. దూకుడైన ఆట తీరు.
2. లోతైన బ్యాటింగ్
3. ఎక్కువ మంది ఆల్‌రౌండర్లు

బలహీనతలు
1. స్పిన్‌లో తడబాటు
2. కీలకమ్యాచ్‌ల్లో బజ్‌బాల్‌ వైఫల్యం
3. స్టార్‌ పేసర్లు లేకపోవడం

న్యూజిలాండ్‌
బలాలు
1. విలియమ్సన్‌ రీఎంట్రీ
2. ఆల్‌రౌండర్లు ఫిలిప్స్‌, మిచెల్‌, నీషమ్‌
3. ఉపఖండ పిచ్‌లపై అనుభవం

బలహీనతలు
స్పిన్‌లో తడబాటు
స్టార్‌ ప్లేయర్లకు గాయాల బెడద
గొప్ప ఫామ్‌లో జట్టు లేకపోవడం

పాకిస్థాన్‌
బలాలు
1. బ్యాటర్లు బాబర్‌ అజామ్‌, మహమ్మద్‌ రిజ్వాన్‌
2. పేసర్లు షహీన్‌ షా అఫ్రీది, హారిస్‌ రవూఫ్‌
3. తమ లాంటి పరిస్థితులే భారత్‌లో ఉండటం

బలహీనతలు
1. ఒత్తిడికి చిత్తవడం
2. ఫకర్‌ జమాన్‌ & మిడిలార్డర్‌ ఫామ్‌లో లేకపోవడం
3. నసీమ్‌ షా జట్టుకు దూరం, నాణ్యత లేని స్పిన్నర్లు

దక్షిణాఫ్రికా
బలాలు
1. మిల్లర్, డికాక్‌ అనుభవం
2. మార్కో జేన్సన్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌ ఫామ్‌
3. ఐపీఎల్‌తో భారత పిచ్‌లపై అనుభవం

బలహీనతలు
1. కీలక ఆటగాళ్లు ఫామ్‌లో లేకపోవడం
2. పెద్దజట్ల చేతిలో వైఫల్యాలు
3. నాకౌట్స్‌లో తడబడటం

బంగ్లాదేశ్‌
బలాలు
1. షకిబ్‌ అల్‌ హసన్‌, ముస్తాఫిజర్‌
2. నాణ్యమైన స్పిన్నర్లు
3. చాలా పొదుపుగా బౌలింగ్‌ చేయడం

బలహీనతలు
పేలవ బ్యాటింగ్‌
తమిమ్‌ ఇక్బాల్‌, ఎబాదత్‌ జట్టుకు దూరం
మ్యాచ్‌ విన్నర్లు జట్టులో లేకపోవడం

అఫ్గానిస్థాన్‌
బలాలు
1. స్టార్‌ ఆల్‌రౌండర్లు రషీద్‌ ఖాన్‌, మహ్మద్‌ నబీ
2. నాణ్యతమైన బౌలింగ్‌
3. సంచలనాలు సృష్టించే సత్తా

బలహీనతలు
1. స్టార్‌ ప్లేయర్లపై ఆధారపడటం
2. నిలకడలేమి ఆట
3. ఫామ్‌లో లేని ఆటగాళ్లు

శ్రీలంక
బలాలు
1. టాప్‌ ఆర్డర్‌ నిషాంక, పెరెరా, కుశాల్ మెండిస్‌
2. యంగ్‌ ప్లేయర్లు వెల్లలాగే, పతిరానా, తీక్షణ
3. భారత్‌లోని పరిస్థితులు

బలహీనతలు
1. హసరంగా, చమీరా జట్టుకు దూరమవ్వడం
2. మిడిలార్డర్‌
3. ఫామ్‌లో ఆల్‌రౌండర్లు లేకపోవడం

ఇక మరో జట్టు నెదర్లాండ్స్‌.. వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్‌ ప్లేఆఫ్స్‌లో విజయం సాధించి అర్హత సాధించింది. వెస్టిండీస్‌పై సూపర్‌ ఓవర్‌లో గెలిచిన ఉత్సాహంతో పసికూన జట్టు బరిలోకి దిగుతుంది. అయితే ఈ మెగాటోర్నీలో వెస్టిండీస్‌ లేకపోవడం క్రికెట్ అభిమానులను ఎంతో నిరుత్సాహపరుస్తుంది. చరిత్రలో తొలిసారి విండీస్‌ జట్టు టోర్నీకి అర్హత సాధించలేకపోయింది.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links