kiwi
Home » కొంపముంచిన అఫ్గాన్‌ ఫీల్డింగ్‌- కివీస్‌ 288/6

కొంపముంచిన అఫ్గాన్‌ ఫీల్డింగ్‌- కివీస్‌ 288/6

by admin
0 comment

చెన్నై వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌కు న్యూజిలాండ్‌ 289 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించింది. గ్లెన్‌ ఫిలిప్స్‌ (71), టామ్ లాథమ్‌ (68), విల్‌ యంగ్‌ (54) అర్ధశతకాలతో రాణించారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌ ఆరు వికెట్లు కోల్పోయి 288 పరుగులు చేసింది. ఆదిలోనే ఓపెనర్ కాన్వాయ్‌ (20) ఔటైనా ..విల్‌ యంగ్, రచిన్‌ (32) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 79 పరుగులు జోడించారు. అయితే కుదురుకున్న వీరిద్దరు బ్యాటర్లను అజ్మతుల్లా ఒకే ఓవర్‌లో పెవిలియన్‌కు చేర్చాడు. తర్వాత ఓవర్‌లోనే మిచెల్‌ (1)ను రషీద్ ఔట్‌ చేసి కివీస్‌ను కష్టాల్లోకి నెట్టారు.

ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన ఫిలిప్స్‌, లాథమ్ 144 పరుగుల రికార్డు భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి అఫ్గాన్‌పై పైచేయి సాధించారు. ప్రపంచకప్‌లో కివీస్‌ తరఫున అయిదో వికెట్‌కు ఇదే రెండో అత్యుత్తమ భాగస్వామ్యం. అయితే తొలుత నిదానంగా ఆడిన ఈ జోడీ తర్వాత దూకుడు పెంచింది. ఎడాపెడా బౌండరీలు బాదారు. అయితే ఆఖర్లో వీరిద్దరిని నవీనుల్ ఔట్‌ చేసినా ఛాంప్మన్‌ (25*) బ్యాట్‌ ఝుళిపించి స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. అయితే ఇంగ్లాండ్‌పై సంచలన విజయంతో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగిన అఫ్గాన్‌ బౌలర్లు గొప్పగానే పోరాడారు. కానీ, పేలవ ఫీల్డింగ్‌, చేజార్చిన క్యాచ్‌లతో కివీస్‌కు అవకాశం కల్పించారు. రషీద్‌ఖాన్‌ నాలుగు వికెట్ల పడగొట్టడానికి ప్రయత్నించినా ఫీల్డింగ్‌ వైఫల్యంతో అతడు ఒక్క వికెట్‌తోనే రిపెట్టుకున్నాడు.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links