342
ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-1 తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్వ్యూల అనంతరం ఉద్యోగాలకు ఎంపికైన వారి జాబితాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గురువారం ప్రకటించింది. మొత్తం 16 విభాగాల్లో 110 పోస్టులకు ఎంపిక చేశారు. కాగా, ఈ ఏడాది జనవరిలో ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. దాదాపు 85 వేల మంది ప్రిలిమ్స్ పరీక్ష రాయగా 6455 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు. జూన్ 3 నుంచి10వ తేదీ వరకు మెయిన్ పరీక్షలు నిర్వహించారు.
అనంతరం 1:2 నిష్పత్తిలో ఇంటర్వ్యూలకు అభ్యర్థులను ఎంపిక చేశారు. ఇటీవల ఇంటర్వ్యూలు ముగియడంతో ఉద్యోగానికి ఎంపికైన ఫైనల్ జాబితాను ఇవాళ విడుదల చేశారు. భానుశ్రీ లక్ష్మీ, భూమిరెడ్డి భవాని, లక్ష్మీ ప్రసన్న తొలి మూడు ర్యాంక్‌లు సాధించారు. మొదటి పది స్థానాల్లో ఆరుగురు మహిళా అభ్యర్ధులు ఉన్నారు.