c3 vikram
Home » Chandrayaan-3 మరో విజయం: విడిపోయిన విక్రమ్‌

Chandrayaan-3 మరో విజయం: విడిపోయిన విక్రమ్‌

by admin
0 comment

భారత వ్యోమనౌక చంద్రయాన్‌-3 లక్ష్యం దిశగా దూసుకెళ్తోంది. ప్రొపల్షన్‌ మాడ్యుల్‌ నుంచి ల్యాండర్‌ మాడ్యూల్‌ విక్రమ్‌ విజయవంతంగా విడిపోయింది. ఇప్పటి నుంచి ల్యాండర్‌ మాడ్యూల్‌ చంద్రుని చుట్టూ సొంతంగా చుట్టేస్తుంది. రేపు సాయంత్రం 4 గంటలకు డీ-అర్బిట్‌-1 ప్రక్రియ చేపట్టనున్నట్లు ఇస్రో తెలిపింది. ఆ తర్వాత ఈ నెల 20న మరోసారి డీ-ఆర్బిట్‌-2 ప్రక్రియ చేపట్టనున్నట్లు వెల్లడించింది. అంతా సజావుగా సాగితే ఈ నెల 23న సాయంత్రం 5.47 గంటల సమయంలో ల్యాండర్‌ జాబిల్లిపై అడుగుపెడుతుంది.

నాలుగేళ్ల కిందట ప్రయోగించిన చంద్రయాన్‌-2లో ల్యాండింగ్‌ సమస్య తలెత్తిన సంగతి తెలిసిందే. అనంతరం ఇస్రో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చంద్రయాన్‌-3ను సిద్ధం చేసింది. జులై 14న ఎల్‌వీఎం3-ఎం4 రాకెట్‌ ద్వారా విజయవంతంగా భూకక్ష్యలో ప్రవేశపెట్టింది. కాగా, జాబిల్లిపై భారత వ్యోమనౌక సాఫీగా దిగితే దక్షిణ ధ్రువం వద్ద ఈ ఘనత సాధించిన తొలి దేశంగా చరిత్ర సృష్టిస్తుంది. అంతేగాక చంద్రుడిపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ను సాధించిన నాలుగో దేశంగా భారత్‌ గుర్తింపు పొందుతుంది.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links